China-Taiwan: చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాలు భారీ విన్యాసాలు
- నోరు జారిన జపాన్ ప్రధాని సనే తకైచి
- తైవాన్ చుట్టూ మోహరించిన చైనా సైన్యం
- చైనా-తైవాన్ మధ్య టెన్షన్ వాతావరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు సద్దుమణుగుతున్నాయని అనుకుంటున్న తరుణంలో మరో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా చైనా-తైవాన్ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ దేశం భారీ విన్యాసాలకు దిగుతోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో కొత్త తలనొప్పి మొదలయ్యేటట్టు కనిపిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని యుద్ధాలు ముగింపు దిశకు చేరుకున్నాయి. గత శనివారం థాయ్‌లాండ్-కంబోడియా దేశాలు కూడా కాల్పుల విరమణ ప్రకటించాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఆదివారం ట్రంప్-జెలెన్‌స్కీ భేటీ తర్వాత సానుకూల సంకేతాలు వ్యక్తమయ్యాయి. అతి త్వరలోనే రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించనున్నాయి.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఇలాంటి తరుణంలో జపాన్ ప్రధాని సనే తకైచి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లైంది. తైవాన్ విషయంలో చైనా జోక్యం చేసుకుంటే.. తాము కూడా రంగంలోకి దిగాల్సి వస్తుందని సనే తకైచి వ్యాఖ్యానించారు. ఇదే చైనాకు కోపం తెప్పించింది. తాజాగా చైనా దళాలు తైవాన్‌ను చుట్టుముట్టాయి. భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు సైన్యం ప్రకటించింది. ఇప్పటికే వాయుసేన, నేవీ, రాకెట్ ఫోర్స్ దళాలు తైవాన్ సమీపంలో మోహరించి గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Bengaluru: కొత్త జంట షాకింగ్ నిర్ణయం.. వెయ్యి కి.మీ ప్రయాణం చేసి ఏం చేశారంటే..!
తైవాన్ చుట్టూ మంగళవారం లైవ్-ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తుందని.. ద్వీపం చుట్టూ ఉన్న ఐదు జోన్లలో సముద్ర, గగనతల విన్యాసాలు ఉంటాయని రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా నివేదించింది. ‘‘జస్ట్ మిషన్ 2025’’ అని పిలువబడే విన్యాసాలపై దృష్టి సారించినట్లు చైనా సైన్యం తూర్పు థియేటర్ కమాండ్ ప్రతినిధి తెలిపారు. దీంతో చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
అయితే చైనా విన్యాసాలను తైవాన్ ప్రభుత్వం ఖండించింది. ఇది కచ్చితంగా సైనిక బెదిరింపేనని పేర్కొంది. ఇటువంటి చర్యలు సంబంధాలు దెబ్బతీస్తాయని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Mexico Train Accident: మెక్సికోలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!