ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ గెలుపు బోణి చేసింది. వరుసగా 8 పరాజయాల తర్వాత తొలిసారిగా గెలుపు రుచి చూసింది. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా అతడు ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2018 నుంచి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ […]
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కారణంగా జి.కొత్తపల్లిలో పోలీసుల రెండు వారాల పాటు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో 8 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులు మోహరించారు. ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బజారయ్య ద్వారకాతిరుమల పోలీసుల […]
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77), డికాక్ (23) రాణించారు. తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న రాహుల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 77 పరుగులు చేసి తన జట్టుకు […]
కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం దారుణహత్య చోటుచేసుకుంది. సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడి హత్య కలకలం రేపింది. తలాటం శివ అనే యువకుడిని మణి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టినరోజు సందర్భంగా శివ అనే వ్యక్తి సామర్లకోటలోని స్థానిక విఘ్నేశ్వర థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చాడు. అయితే అతడిని థియేటర్ వద్దే మణి అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో పుట్టినరోజు నాడే శివ చనిపోయాడు. ఈ ఘటనపై […]
తిరుపతిలో జనసేన పార్టీ వినూత్నంగా నిరసన చేపట్టింది. ఇటీవల జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా ఓ కుటుంబం తిరుపతి వెళ్తుండగా రవాణాశాఖ అధికారులు బలవంతంగా కారు తీసుకెళ్లడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా సీఎం జగన్ తిరుపతి పర్యటన ఖరారు కావడంతో జనసేన పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడ పార్క్ వద్ద ‘జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త’ అంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, పట్టణ […]
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గతనెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఈ మేరకు 2022 ఏప్రిల్ నెలలో రూ.1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇది జీవితకాల గరిష్ఠమని తెలిపింది. ఇదే ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42 లక్షల కోట్లు రెండో అత్యధికమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో రూ.25వేల కోట్లు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు 9 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్‌లోనే అద్భుత ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా జట్టు విజయాల గురించి కెప్టెన్ హార్డిక్ పాండ్యా స్పందించాడు. జట్టులో ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే హెచ్చుతగ్గులు లేకపోవడమే తమ విజయాలకు కారణమన్నాడు. తాను కెప్టెన్ అయినా జట్టులోని మిగతా ఆటగాళ్లు తక్కువ అన్న […]
బాపట్ల జిల్లా రేపల్లెలో వివాహితపై అత్యాచారం కేసుపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పందించారు. రేపల్లె రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి ఒంటిగంటకు మద్యం మత్తులో ముగ్గురు యువకులు భార్యాభర్తల వద్దకు వచ్చారని.. సదరు యువకులు టైం అడిగితే భార్యాభర్తలు వాచ్ లేదని చెప్పడంతో దాడి చేసి నగదు లాక్కున్నారని తెలిపారు. భర్తపై దాడి చేస్తుంటే భార్య అడ్డుపడిందని.. నిందితులు వివాహితను పట్టుకుని అత్యాచారం చేశారని.. ఇద్దరు యువకులు అత్యాచారం చేయగా.. మరొకరు సహకరించారని ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు. […]
హైదరాబాద్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పక్క రాష్ట్రం అంటూ సంబోధిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్‌కు జోగి రమేష్ సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ […]
ఏపీలో పదో తరగతి పరీక్షల సందర్భంగా పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. తొలిరోజు తెలుగు, రెండో రోజు హిందీ పరీక్షల పేపర్లు లీక్ అయినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మూడో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడో రోజు నంద్యాల జిల్లా నందికొట్కూరులో టెన్త్ పేపర్ లీక్ అయ్యిందని వార్తలు హల్‌చల్ చేశాయి. గాంధీ మెమోరియల్ హైస్కూల్ నుంచి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. స్కూల్ అటెండర్ ద్వారా పేపర్ […]