నెల రోజులుగా ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రుయాత్ హిలాల్ కమిటీ ముస్లింలకు కీలక ప్రకటన చేసింది. ఆదివారం నాడు ఆకాశంలో నెలవంక కనిపించలేదని.. దీంతో మంగళవారం రంజాన్ పర్వదినం జరుపుకోవాలని సూచించింది. దీంతో సోమవారం పండగ జరుపుకోవాలని ముస్లింలు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకోగా వాటిని మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
అటు తెలంగాణలోని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రంజాన్ పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రార్థనా మందిరాలను స్పెషల్అట్రాక్టివ్గా ఉండేలా రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. కాగా రంజాన్ నెలలోనే మానవాళికి సందేశాన్నిచ్చే పవిత్ర ఖురాన్ దైవగ్రంధంగా అవతరించింది. ప్రపంచంలోని ముస్లింలందరికీ ఖురాన్ మార్గదర్శకంగా ఉంటుంది. ఖురాన్ అవతరించిన నెల కాబట్టే రంజాన్ నెలకు అంత ప్రాముఖ్యత ఉంది. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల కాబట్టి రంజాన్ నెలంతా ముస్లింలు కఠినంగా ఉపవాసం ఉంటారు. మరోవైపు రంజాన్ పండగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా రూ.69 కోట్ల మేరకు మేకలు, పొట్టేళ్ల అమ్మకాలు జరుగుతాయని అక్కడి వ్యాపారులు చెప్తున్నారు.