Toxic : ‘టాక్సిక్’లో హ్యుమా ఖురేషీ.. ఆమె పాత్ర వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ . గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ మరియు యశ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో సందడి చేయబోతోంది. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషన్ల జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ ను వదిలింది.
Also Read : Ranveer -Pralay: రణ్‌వీర్ సింగ్ ‘ప్రలే’లో హీరోయిన్ ఫిక్స్!
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
బాలీవుడ్ సీనియర్ నటి హ్యుమా ఖురేషీ కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె ‘ఎలిజబెత్’ అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రకటించారు. ఈ పాత్ర గురించి దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సినిమాలో ఎలిజబెత్ అడిగే ప్రశ్నలు చాలా లోతుగా ఉంటాయని, అవి ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయని ఆమె తెలిపారు. ఒక విభిన్నమైన మరియు బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా హ్యుమా ఈ చిత్రంలో కనిపిస్తుందని చెప్పారు. అసలు ఇలాంటి పవర్ ఫుల్ పాత్రకు ఎవరిని తీసుకోవాలో అని మొదట్లో చాలా టెన్షన్ పడ్డానని, కానీ హ్యుమా ఖురేషీ సెట్స్‌లోకి అడుగుపెట్టిన క్షణమే తన నటనతో అందరినీ ఫిదా చేసిందని గీతూ ప్రశంసల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!