పూణె వేదికగా ఆదివారం రాత్రి ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్లు రుతురాజ్ గైక్వాడ్ (99), కాన్వే (85 నాటౌట్) మెరుపుల కారణంగా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అయితే చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ఛేదించలేకపోయింది.
అభిషేక్ శర్మ (39), విలియమ్సన్ (47) మంచి ఆరంభమే ఇచ్చినా 58 పరుగుల వద్ద హైదరాబాద్ టీమ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి డకౌట్ కాగా మార్‌క్రమ్ (17) విఫలమయ్యాడు. అయితే నికోలస్ పూరన్ హైదరాబాద్ శిబిరంలో ఆశలు రేపాడు. 33 బంతుల్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులే చేసింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి 4 వికెట్లు పడగొట్టాడు. జడేజా మూడు ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కాగా వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి టాప్-4లోకి దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అనంతరం వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది. అయినా ఇప్పటికీ హైదరాబాద్ టీమ్ నాలుగో స్థానంలోనే ఉంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గైక్వాడ్‌కు లభించింది. టోర్నీలో చెన్నై జట్టుకు ఇది మూడో విజయం మాత్రమే.