పూణె వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ రెచ్చిపోయింది. బలమైన బౌలింగ్ దళం కలిగి ఉంటుందని పేరున్న సన్‌రైజర్స్ జట్టుపై ఏకంగా 200 పరుగులకు పైగా స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ మినహా మిగతా వారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో చెన్నై టీమ్ 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. అతడు 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 99 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే కూడా 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రుతురాజ్, కాన్వే ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 182 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. నటరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి.