ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (43), ఇషాన్ కిషన్ (45) రాణించారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) విఫలమయ్యాడు. పొలార్డ్ (4) కూడా వెంటనే వెనుతిరిగాడు.
కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరోసారి రాణించాడు. తిలక్ వర్మ 16 బంతుల్లో 21 పరుగులు చేయగా టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ఖాన్ 2 వికెట్లు తీయగా.. జోసెఫ్, ఫెర్గూసన్, ప్రదీప్ తలో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 178 పరుగులు చేయాలి.
Ben Stokes: రీఎంట్రీ అదుర్స్.. 64 బంతుల్లోనే స్టోక్స్ సెంచరీ