Sehwag: గెలవాల్సిన మ్యాచ్‌ను వాళ్లు ముంబైకి అప్పచెప్పారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే ఓపెనర్లు శుభారంభం అందించినా.. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసినా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోవడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఆటగాళ్ల నిర్లక్ష్యమే ఈ ఓటమికి కారణమంటూ ఆరోపిస్తున్నారు. మరొక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాల్సిన గుజరాత్ టైటాన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడం వాళ్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (55), శుభ్‌మన్ గిల్ (52) హాఫ్ సెంచరీలు చేసి 106 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే మురుగన్ అశ్విన్ వేసిన 13వ ఓవర్‌లో శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా ఇద్దరూ అవుట్ కావడంతో కథ అడ్డం తిరిగింది. పాండ్యా, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మిల్లర్ దారుణంగా విఫలం కావడంతో గుజరాత్ చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది.
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
దీంతో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హార్డిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లు రనౌట్లయ్యారని మండిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు ఫ్లాప్ అయితే బాగుండేదని.. ఓపెనర్లు అందించిన శుభారంభంతో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఆ జట్టు గెలవాల్సిందని.. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడారని.. గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబైకి అప్పజెప్పారని సెహ్వాగ్ ఆరోపించాడు. అటు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు పీటర్సన్ కూడా గుజరాత్ ఆటగాళ్లపై విమర్శలు కురిపించాడు. రనౌట్ల సందర్భంగా గుజరాత్ బ్యాటర్లు డైవ్ చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. వాళ్ల బ్యాటింగ్ నిరాశ కలిగించిందని.. ఇది పూర్తిగా నిర్లక్ష్యపూరిత ప్రదర్శన అని మండిపడ్డాడు.
Ben Stokes: రీఎంట్రీ అదుర్స్.. 64 బంతుల్లోనే స్టోక్స్ సెంచరీ
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!