వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు నిద్రపట్టక పిచ్చివాగుడు వాగుతున్నారని.. దుర్మార్గులను బంగాళాఖాతంలో కలపాలంటే చంద్రబాబు పొత్తుల గుర్చి మాట్లాడుతున్నారని ఆరోపించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన విజయవంతమైందన్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో జగన్, వైసీపీ నేతలకు కింద తడవడం ప్రారంభమైందని విమర్శించారు.
చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వైసీపీకి వెన్నులో వణుకు పుట్టిందని అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా టీడీపీకి, చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కరెంట్ పోలేదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడితే ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారని.. ఒక్క పైసా తీసుకోని వాళ్లను వాలంటీర్ అంటారని.. డబ్బులు తీసుకుని పనిచేసే వాళ్లను కార్యకర్తలు అంటారని.. ఇదే విషయంపై ప్రభుత్వానికి హైకోర్టు కూడా చీవాట్లు పెట్టిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
Taneti Vanita: పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా చంద్రబాబూ?