Cyclone Effect: రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అకాల వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రస్తుతం ఏపీలోని రైతులు, కౌలు రైతుల పరిస్థితి తయారైంది. ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతన్నను అకాల వర్షాలు, ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. అసని తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దైన ధ్యానం, పంట చేతికి వచ్చిన తరుణంలో నేలనంటిన వరి చేలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో వరి ధాన్యం తడిచి ముద్దగా మారిపోతోంది. అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన వరి చేలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆచంట నియోజకవర్గంలో పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల్లో వర్షాభావంతో ధాన్యం బస్తాలు తడిసిపోయిన పరిస్థితి నెలకొంది. ఎకరాకు 25 వేల నుండి 40 వేల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, పంటలు బాగా పండిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టం ఏర్పడుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం పడిపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పినా.. నేటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినా.. ధాన్యం రేటు మాత్రం పెరగడం లేదంటున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొని గిట్టుబాటు ధర కల్పించాలని.. కోతలు దగ్గర పడుతున్న సమయంలో పంట చేజారిపోయిందని రైతులను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని.. ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
Asani Cyclone: అలర్ట్.. అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..