ప్రధాని మోదీ ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గురువారం సాయంత్రం ఆయన తమిళనాడు వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే మోదీ పర్యటనను కొంతమంది తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్ మోదీ’ అంటూ వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. దీంతో వరుసగా రెండో రోజు కూడా #GoBackModi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
PM Modi: జీ20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే
ప్రధాని మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా ఇదే హ్యాష్ ట్యాగ్ బుధవారం కూడా ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ధరల పెరుగుదల, ఇంధన ధరలు, హిందీ భాషా వివాదం, వ్యాపారవేత్తలకు పెద్ద పీట వేస్తున్నారనే ఆరోపణలు కూడా కేంద్ర ప్రభుత్వంపై వస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పర్యటనను నిరసిస్తూ తమిళనాడులో పెద్ద ఎత్తున యువత ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Go Back Modi