మాజీ క్రికెటర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్‌లను పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ పెన్షన్ పెంపు పురుషులతో పాటు మహిళా మాజీ క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది. కనిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్‌ను రూ.30 వేలకు బీసీసీఐ పెంచింది. అంతేకాకుండా గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.70 వేలకు పెంచింది. ఆటగాళ్లకు కేటగిరీలుగా ఈ పెన్షన్ అందిస్తారు. తమ పెన్షన్లు పెంచాలని ఇండియన్ క్రికెటర్ అసోసియేషన్ (ICA) గత కొన్నాళ్లుగా […]
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అధిక బరువు. అయితే బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదని కొందరు విసుగు చెందుతుంటారు. అలాంటి వాళ్లు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పరగడుపుతో నిమ్మరసం తాగితే ఉపయోగం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఫలితం కనిపిస్తుందని.. తేలికగా బరువు తగ్గవచ్చని చెప్తున్నారు. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది. […]
విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-0తో వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోతుంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిస్తే దక్షిణాఫ్రికాకు సిరీస్ సొంతం అవుతుంది. దీంతో ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోవడంతో టీమిండియా ఒత్తిడికి గురవుతోంది. సత్తా ఉన్న కుర్రాళ్లు జట్టులో ఉన్నా.. […]
★ నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ★ నేడు శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో పర్యటించనున్న సీఎం జగన్.. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఖరీఫ్-2021కు సంబంధించి పంటల బీమా నగదు విడుదల చేయనున్న జగన్ ★ కాకినాడ: నేడు, రేపు రెండు రోజుల పాటు జిల్లాలో కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పర్యటన.. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడనున్న మురగన్ ★ విశాఖ: నేటితో ముగిసిన సముద్రంలో చేపల వేట నిషేధం.. […]
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. తాజాగా టీడీపీపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘పచ్చకుల పార్టీ ‘కౌంట్ డౌన్’ మొదలైంది. 2024 ఎన్నికల మహా పరాజయానికి ముందే చాప్టర్ క్లోజ్. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు కార్యకర్తలను రెచ్చగొట్టి కేసుల్లో ఇరికిస్తున్నాడు దొంగ బాబు. తుప్పు, పప్పులను తరిమికొట్టి, జెండా మోసినోళ్లంతా ఏకమై టీడీపీని […]
గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనుమర్లపూడి చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో వారు ఘర్షణకు దిగారు. ధూళిపాళ్లకు వ్యతిరేకంగా గోబ్యాక్ నరేంద్ర, డౌన్ డౌన్ నరేంద్ర అంటూ […]
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. టీడీపీ గత సంప్రదాయాన్ని పాటించింది కాబట్టే ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీలు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని […]
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వెంకాయమ్మ కుటుంబంపై దాడి జరిగిందంటూ ఆరోపిస్తూ.. ఈ ఘటనకు నిరసనగా టీడీపీ ‘చలో కంతేరు’ పేరుతో ఆందోళనలు చేపట్టింది. అయితే టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో కంతేరు ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. కంతేరులో సునీత, వంశీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందని.. దీనిపై ఇద్దరూ ఫిర్యాదు చేయగా కేసులు నమోదు […]
ఏపీ సీఎం జగన్‌పై నటుడు అలీ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు పూర్తవడంతో పాటు త్వరలో ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆదివారం నాడు వైసీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో నటుడు అలీ పాల్గొన్నారు. వైసీపీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు తమ కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. […]
క్రిప్టో కరెన్సీలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. బిట్ కాయిన్ ధర మరోసారి భారీగా పతనమైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా డిజిటల్ కరెన్సీ నేలచూపులు చూస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. క్రిప్టో మార్కెట్ పడిపోతుండటంతో బిట్ కాయిన్ విలువ 25వేల డాలర్ల దిగువకు పడిపోయింది. సోమవారం ఉదయం బిట్‌కాయిన్ 25,745 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. గత ఐదురోజుల్లో బిట్ కాయిన్ 15 శాతం నష్టపోయింది. ఈ ఏడాది ఇప్పటి […]