కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పబ్జీ గేమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఓడిపోయావని తోటి పిల్లలు హేళన చేయడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 ఏళ్ల బాలుడికి ఫోన్‌లో పబ్జీ ఆడటం అలవాటు. రోజూలాగే పబ్జీ గేమ్ ఆడాడు. అయితే ఈసారి గేమ్‌లో ప్రభు ఓడిపోయాడు. దీంతో.. ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. గెలుపు మంత్రాన్ని మాత్రమే జపించే […]
ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో గన్నవరం రచ్చ కొనసాగుతోంది. రెండు రోజుల నుంచి వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు కత్తులు నూరుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. వైసీపీలో వంశీ వర్సెస్ దుట్టా, వంశీ వర్సెస్ యార్లగడ్డ వర్గాలుగా చీలిక కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. దుట్టా రామచంద్రరావు పెద్ద మనిషి అని గౌరవించానని.. కానీ ఆయన హద్దు […]
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన పార్టీ అంచనా వేస్తోంది. 2023 మార్చిలో ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. అక్టోబర్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అక్టోబరు 5న విజయదశమి సందర్భంగా తిరుపతిలో పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కాగా పవన్ కళ్యాణ్ […]
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు వాసి వెంకాయమ్మ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై వైసీపీ వర్గీయుల దాడులు రాష్ట్రంలో పరిపాటిగా మారాయని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. దాడులు, దూషణలు, బెదిరింపులు, హత్యల ద్వారా తమను విమర్శించేవాళ్లను వైసీపీ భయాందోళనలకు గురిచేస్తోందని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారుల సహకారంతో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వాన్ని విమర్శించారంటూ గత నెల […]
కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగారు.ఇషాన్ కిషన్(34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు షాకుల మీదు షాకులు తగిలాయి. రుతురాజ్ గైక్వాడ్ (1), రిషబ్ పంత్ (5), హార్డిక్ పాండ్యా (9), అక్షర్ పటేల్(10) ఇలా వచ్చి అలా వెళ్లారు. టీమిండియా 140 […]
ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అని అర్ధం. లాక్‌డౌన్ పుణ్యమా అంటూ ఓటీటీలకు భారీగా డిమాండ్ పెరిగింది. స్మార్ట్ టీవీల రాక కూడా ఓటీటీలకు ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో ఓటీటీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అన్ని ఓటీటీలకు సపరేట్‌గా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే సామాన్యుడికి భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లే ప్రీమియం బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో 12 ఓటీటీల కంటెంట్ వీక్షించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటిలో సోనీ […]
హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన సెంచురీ ఆస్పత్రి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో వాకర్ల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని వయసులకు చెందిన 200 మందికి పైగా వాకర్లు ఈ శిబిరంలో పాల్గొని ఉచితంగా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. దాంతో పాటు శిబిరంలో పాల్గొన్న వైద్యుల నుంచి సలహాలతో ప్రయోజనం పొందారు. రక్తపోటు పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలు, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ విశ్లేషణ లాంటి పరీక్షలను […]
రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లో ఉన్న సారథి ఆస్పత్రిలో పూజలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రి యజమాని పార్థసారధి ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో డాక్టర్ సారధి భార్య చంద్రకళ భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన దశ మహా విద్య, ధూమావతి, ప్రత్యంగిర చినమస్త అనేవి తాంత్రిక పూజలు అని ఆమె ఆరోపించారు. అయితే ఈ పూజలపై ఆస్పత్రి యజమాని పార్థసారధిని వివరణ అడగ్గా.. ఇది సాధారణ పూజలేనని.. […]
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్ల ద్వారా విమర్శల వర్షం కురిపించారు. ‘ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి. నాలుగు పచ్చ కుల ఛానళ్ల మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు. నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజాకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా ‘బూజు లాంటి రాజు.. ఓ పెగ్గు రాజు.. నీ పదవీ నీ విగ్గులాంటిదే.. […]
ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లిన ఏపీ యువకుడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. చాలామంది యువతీయువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఈ జాబితాలో కర్నూలుకు చెందిన దిలీప్ అనే యువకుడు కూడా ఉన్నాడు. కర్నూలు జిల్లా బాలాజీనగర్‌కు చెందిన చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల కుమారుడు దిలీప్ అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేశాడు. అగ్రికల్చర్‌లోనే ఎమ్మెస్సీ చేయాలని నిర్ణయించుకుని ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. 2019 సెప్టెంబర్‌లో ఇటలీకి వెళ్లి అనుకున్నట్లుగానే అక్కడ ఎమ్మెస్సీ […]