టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ‘బాహుబలి’ బాలీవుడ్‌కు ఇన్‌స్పిరేషన్ ఇచ్చినట్లుంది. అందుకే బాలీవుడ్‌లో చాన్నాళ్లకు సోషియో ఫాంటసీ మూవీ వస్తోంది. ఆ సినిమానే బ్రహ్మాస్త్ర. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తెలుగులో ఈ మూవీ ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాను బాహుబలి తరహాలో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. తెలుగులో తొలి భాగానికి శివ అని […]
కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం చోటు చేసుకుంది. నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కోసిగి మూడోవార్డులో నాలుగు రోజుల క్రితం బూగేని మాదేవి అనే మహిళ తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది. వాళ్లతో పాటు ఆడుకుంటున్న మరో బాలుడు శ్రీరాములు కూడా ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. కొన్ని పండ్లను చిన్నారుల తల్లి […]
కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్న వారికి గ్యాస్ కంపెనీలు చేదువార్తను అందించాయి. ఎవరైనా కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలి. అలాగే రెగ్యులేటర్‌కు కూడా డబ్బులు చెల్లించాలి. అయితే తాజాగా గ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచేశాయి. గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్ ధర ఇప్పటివరకు రూ.1,450 ఉండగా.. దానిని రూ.2,200కి పెంచుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీలు ప్రకటించాయి. ఐదు కేజీల సిలిండర్‌పై డిపాజిట్ మొత్తాన్ని రూ.800 నుంచి […]
టీడీపీ అధినేత నారా చంద్రబాబు జిల్లాల పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పలు జిల్లాలలో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న తొలి మహానాడుతో చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ విధ్వంసకర పాలనను ఎండగడుతూ ప్రజల భవిష్యత్‌కు భరోసా […]
నాటింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును అద్భుత రీతిలో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 299 పరుగుల లక్ష్యాన్ని కేవలం 50 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఛేదించింది. దీన్ని బట్టి ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా బెయిర్‌స్టో టీ20 మ్యాచ్ తరహాలో ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో కొండంత లక్ష్యం కర్పూరంలా కరిగిపోయింది. 93 పరుగులకే నాలుగు వికెట్లు పడినా […]
అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రం రెండో వారంలోనూ సంతృప్తికర వసూళ్లు రాబడుతోంది. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సినిమా యూనిట్ ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ను ప్రకటించింది. టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. పాఠశాల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా […]
ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం మంగళవారం ముగిసింది. 2023-2027 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి రూ.48,390.52 కోట్ల భారీ ఆదాయం లభించింది. టీవీ ప్రసార హక్కుల వేలంలో సోనీ నెట్‌వర్క్‌పై స్టార్ నెట్‌వర్క్ పైచేయి సాధించింది. దీంతో వచ్చే ఐదేళ్ల పాటు ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్-18, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు సంయుక్తంగా […]
ఏపీలోని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 20 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరం నుంచి అప్రెంటీస్‌షిప్‌తో కూడిన 11 కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్స్, కళాశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ పోలా భాస్కర్ వెల్లడించారు. కొత్త కోర్సులలో బీఏ టూరిజం, హాస్పిటాలిటీ బీబీఏ, హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ […]
★ ఏపీ అసెంబ్లీలో ఉదయం 11 గంటలకు హౌస్ కమిటీ భేటీ.. భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన హౌస్ కమిటీ సమావేశం.. పెగాసస్ వ్యవహారంపై చర్చించనున్న హౌస్ కమిటీ.. ఇవాళ హోంశాఖతో పాటు వివిధ శాఖలతో కమిటీ భేటీ ★ అమరావతి: నేటి నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు… నేడు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు.. ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా పేరుతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ★ తిరుమల: నేడు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్‌లు విడుదల.. […]
నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన చేసేది విలన్ క్యారెక్టర్స్ అయినా మనసు మాత్రం ఎంతో మంచిది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో సోనూసూద్ ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఎందరికో సహాయం అందించి మన్ననలు అందుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలాంటి సాయం అడిగినా అడుగు ముందుకేసి చేసేస్తుంటాడు. తాజాగా సోనూసూద్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక […]