కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కీలకంగా సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీ వివరాలను ఆయన సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి వివరించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఉండవల్లి తెలిపారు. తాజాగా ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ప్రధాన […]
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతులకు పంటల బీమా పరిహారం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మోసం చేయడంలో చంద్రబాబు, […]
జీవితం అన్న తర్వాత కడుపు నిండాలంటే ఉద్యోగం చేయాల్సిందే. అయితే ఉద్యోగం చేసేవాళ్లు ఆఫీసుకు ఒక్కోసారి లేటుగా వెళ్తుంటారు. లేటుగా ఎందుకొచ్చావని కారణం అడిగితే సవాలక్ష చెప్తారు. ట్రాఫిక్ ఉందని.. బస్సు దొరకలేదని.. బండి చెడిపోయిందని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు. పైగా ఆఫీసు అన్నాక ఓ నిమిషం అటూ ఇటు అవుతుందని బాస్‌లతో వాదిస్తారు. ఇదిలా ఉంచితే.. తాజాగా ఓ ఆఫీస్‌కు చెందిన సర్క్యులర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ […]
యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నితిన్ సంపాదించుకున్నాడు. జయం సినిమాతో టాలీవుడ్‌లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతోంది. అంటే రెండు దశాబ్దాలు. ఓ హీరోకు 20 ఏళ్ల కెరీర్ అంటే ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. హీరో నితిన్‌కు ఈ 20 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. జూన్ 14, 2002న నితిన్ తొలి సినిమా జయం సినిమా విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ […]
దేశవ్యాప్తంగా ఉద్యోగం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ అందించారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టబోతోంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల స్థితిగతులపై మంగళవారం నాడు ప్రధాని మోదీ సమీక్షించారు. ఈ మేరకు ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ […]
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. దీనికి కారణం అతడి కుమార్తె ఖతీజా వివాహం. గతనెలలో ఖతీజా రెహ్మాన్ ప్రముఖ ఆడియో ఇంజనీర్, బిజినెస్ మెన్ రియాస్‌దీన్ షేక్ మహమ్మద్‌ను వివాహం చేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన ఈ వెడ్డింగ్‌కు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా చెన్నైలోనే వెడ్డింగ్ రిసెప్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా ప్రముఖ నటుడు […]
కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ మే 24న అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్ల దాడి కూడా చేశారు. ఇప్పటికే ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా అమలాపురం అల్లర్ల కేసులో మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు సత్యరుషి, సుభాష్, మురళీకృష్ణ, రఘుపై కేసు […]
ఏపీలో రెండు నెలల కిందట జరిగిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కేబినెట్ బెర్త్ దక్కింది. దీంతో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రోజాకు మంత్రి పదవి రాకూడదని ఓ సీనియర్ హీరోయిన్ కోరుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కట్ చేస్తే.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే క్రమంగా జబర్దస్త్‌లోని కమెడియన్‌లు ఈ షోను […]
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4న విశాఖ రానున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జూలై 4న భీమవరం వస్తున్న నరేంద్ర మోదీ అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరల మీద అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆయన విశాఖ మన్యం బెబ్బులిగా మారి నాటి బ్రిటిష్ దొరల మీద భయంకరమైన యుద్ధం […]
ఏపీ ప్రభుత్వంలో నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ జగన్ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం సలహాదారుడు ఎం.శామ్యూల్ (రిటైర్డ్ ఐఏఎస్), జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్) పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీళ్లంతా మరో ఏడాది పాటు సలహాదారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా 2019లో జగన్ […]