Kapil Dev: కోహ్లీకి కూడా అశ్విన్ లాంటి పరిస్థితే వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీపై మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న కోహ్లీని టీ20ల నుంచి తప్పించాలని సెలక్టర్లకు కపిల్ దేవ్ సూచించాడు. అశ్విన్ వంటి మేటి బౌలర్‌నే తప్పించినప్పుడు కోహ్లీని ఎందుకు పక్కనబెట్టరని ప్రశ్నించాడు. అశ్విన్ టెస్టుల్లో వరల్డ్ నంబర్ 2 ఆటగాడు అని… అలాంటి ఆటగాడినే పక్కనపెట్టారని.. కోహ్లీకి కూడా ఇదే పరిస్థితి వస్తుందని కపిల్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ మునుపటిలా బ్యాటింగ్ చేయడం లేదని.. అతడు తన గత ప్రదర్శనల కారణంగా జట్టులో స్థానం సంపాదిస్తున్నాడని.. కానీ ఇది కరెక్ట్ కాదన్నాడు. జట్టులో స్థానం సంపాదించేందుకు ఎంతో మంది యువకులు పోటీ పడుతున్నారని.. విరాట్ కూడా జట్టులో స్థానం కోసం యువకులతో పోటీ పడాలని కపిల్ దేవ్ హితవు పలికాడు.
Read Also: IND Vs ENG: రాణించిన జడేజా.. రెండో టీ20లో ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..?
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
- BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
- BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
అటు యువకులు కూడా విరాట్‌ను అధిగమించాలని కపిల్ దేవ్ సూచించాడు. వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇస్తే అతడిని దూరం పెట్టినట్లే పరిగణించాలని కపిల్ దేవ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్ తీరుతెన్నులు చూస్తుంటే కోహ్లీ ఇదే ఆటతీరుతో ఎక్కువ కాలం కొనసాగలేడని, అతడిని కూడా జట్టు నుంచి తప్పించే పరిస్థితి కనిపిస్తోందని కపిల్ తెలిపాడు. అనేక ఆప్షన్‌లు ఉన్నప్పుడు ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా లాంటి ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇవ్వాలని కపిల్ అన్నాడు. కాగా కోహ్లీ గత మూడేళ్ల నుంచి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అటు ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ 16 మ్యాచ్‌లు ఆడి 115.98 సగటుతో కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 11, 20 పరుగులతో విఫలమయ్యాడు. ఈరోజు ఇంగ్లండ్‌తో టీ20లోనూ ఒక్క పరుగుకే అవుటయ్యాడు.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!