World Emoji Day: సోషల్ మీడియాలో మన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసేందుకు చాలా మంది ఎమోజీలను వాడుతుంటారు. అయితే ఎమోజీ అంటే ఏంటో ఇప్పటికీ చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. పూర్వకాలంలో ఆదిమానవులు సైగలతోనే మాట్లాడుకునే వాళ్లు. తర్వాత కాలం మారుతున్న కొద్దీ మాటలు, పాటలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఎమోజీల యుగం నడుస్తోంది. ఎమోజీ ఉంటే మాట్లాడే అవసరం ఉండదు. అందుకే ఇప్పుడు చాలా మంది చాటింగ్ చేసుకునే సమయంలో మాటల బదులు ఎమోజీలను […]
బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అనగాని నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. రేపల్లెలోని పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తామని శనివారం నాడు టీడీపీ ప్రకటించింది. మద్యం మరణాలపై టీడీపీ వేసిన నిజనిర్ధారణ కమిటీ బాధిత కటుంబాలను కలిసేందుకు సిద్ధమైంది. అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ […]
India Vs England: మాంచెస్టర్ వేదికగా ఈరోజు టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. టీ20 సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత్ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. అయితే రెండో వన్డేలో షాక్ తగిలింది. 240 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఇరు […]
ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఎలా వున్నాయి..? ఏ రాశివారికి ఎలా వుండబోతుంది? ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏ దైవానికి ఎలాంటి పూజలు చేయాలి? ఏ రాశివారు ఏ పనులు వాయిదా వేసుకుంటే మంచిది? వంటి పూర్తి వివరాల కోసం భక్తి టీవీ వీడియోను క్లిక్ చేయండి.
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. https://www.youtube.com/watch?v=qEgLF95VYOA
* తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ.. ఉదయం శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పణ.. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు * బాపట్ల జిల్లా: నేడు రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన కుటుంబాలను పరామర్శించనున్న టీడీపీ నేతలు.. మద్యం మరణాలపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన * నంద్యాల: నేడు ఆత్మకూరులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్న ఎమ్మెల్యే […]
ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ పేరుతో పథకాన్ని అమలు చేశామని.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ […]
ఉభయగోదావరి జిల్లాలలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కూనవరం బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై నుంచి గోదావరి పరుగులు తీస్తోంది. ఇప్పటికే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయగా.. ప్రజలు కాలినడకన బ్రిడ్జి దాటుతున్నారు. అటు గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. 24 గంటల పాటు గోదావరి ప్రవాహం.. వరద ముంపును మానిటర్ చేస్తోంది. […]
సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అదరగొడుతోంది. శనివారం ఉదయం జరిగిన సెమీఫైనల్‌లో విజయం సాధించి ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జపాన్ ప్లేయర్ సీనా కవాకమీపై 21-15, 21-7 తేడాతో సింధు విజయం సాధించింది. సింధు ఈ మ్యాచ్‌ను కేవలం 32 నిమిషాల్లోనే ముగించింది. దీంతో టైటిల్‌కు ఇంకా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఈ ఏడాది పీవీ సింధుకు ఇదే మొదటిసారి. Read […]
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నెలరోజులుగా టీడీపీ పనికిమాలిన చర్చ పెట్టిందని.. అదాన్ అనే కంపెనీ తనదేనని దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్తే నిజమై పోతుందని టీడీపీ నమ్మకమని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తన అల్లుడు కంపెనీకి చెందినవాడని ఆరోపిస్తున్నారని.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ […]