Pawan Kalyan Bhimavaram Visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భీమవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావాణి-జనసేన భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భీమవరంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని.. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. భీమవరం రాగానే డంపింగ్ యార్డ్ సమస్య ఏమైందని అడిగితే అప్పటికీ, […]
అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ నిరాశ పరిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన భారత తొలి మేల్ లాంగ్ జంపర్‌గా చరిత్ర సృష్టించిన శ్రీ శంకర్ ఫైనల్‌గా పతకం మాత్రం అందుకోలేకపోయాడు. పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్ ఏడో స్థానంతో సరిపెట్టాడు. కనీసం క్వాలిఫికేషన్ రౌండ్‌లో అందుకున్న దూరాన్ని కూడా ఫైనల్లో అతడు చేరుకోలేకపోయాడు. ఫైనల్లో అన్ని ప్రయత్నాల్లో అత్యధికంగా 7.96 […]
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సింగపూర్ ఓపెన్-2022 విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్‌లో చైనా ప్లేయర్ వాంగ్ జి యీని 21-9, 11-21, 21-15 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ప్రారంభసెట్‌ను సింధు 12 నిమిషాల్లోనే ముగించింది. దీంతో 21-9తో తొలి సెట్‌ను సింధు గెలవగా రెండో సెట్‌ను 21-11 తేడాతో వాంగ్ జి యీ గెలిచింది. దీంతో మూడో సెట్లో […]
CM KCR Sensational Comments: భద్రాచలం పర్యటనలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని ఆరోపించారు. దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని.. దీని వెనుక కుట్రలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గతంలో లేహ్‌లో ఇలా చేశారని.. ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారని.. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని కేసీఆర్ […]
భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. జనసేన ఆధ్వర్యంలో ఆయన జనవాణి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు స్థానికుల నుంచి వినతులను ఆయన స్వీకరిస్తున్నారు. https://www.youtube.com/watch?v=SHfMzjJ6Ebg
Anathapuram Priest: సమాజంలోని గౌరవప్రదమైన వృత్తుల్లో అర్చకత్వం కూడా ఒకటి. అర్చకులు, పురోహితులకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. భక్తులు ఆలయానికి వెళ్లి అర్చకుడితో పూజలు చేయించుకుని ఆయన కాళ్లకు మొక్కుతారు. అయితే కొందరు అర్చకత్వం ముసుగులో ఆ వృత్తి విలువలకు కళంకం తెస్తున్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల తరహాలో ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో అనంతపురం జిల్లాకు చెందిన అనంత శయన అనే పూజారి ఉన్నాడు. ఆలయానికి పూజల కోసం వచ్చే యువతులను టార్గెట్ చేయడమే […]
Mahesh Babu Appreciates Agent Movie Teaser: గత ఏడాది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో హాలీవుడ్ లెవల్ స్టంట్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ సినిమాకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆల్ ది బెస్ట్ […]
Somu Veeraju wrotes letter to cm jagan mohan reddy: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. దేవాలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలు, మొక్కుబడుల సొమ్ములను దేవాలయ నిర్వహణ ఖర్చులకు పోను మిగిలిన సొమ్మును సర్వశ్రేయోనిధికి జమ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ ద్వారా ఆలయాల ఈవోలను ఆదేశించారో లేదో హిందూసమజానికి వెల్లడించాలని సోము వీర్రాజు డిమాండ్ […]
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకేరోజు అటు సీఎం కేసీఆర్, ఇటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటిస్తున్నారు. కేసీఆర్ రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకోనుండగా.. గవర్నర్ రైలు మార్గంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
ఏపీలో గోదావరి నది పోటెత్తుతుండటంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చాలా గ్రామాలు నీటి మునిగాయి. ఇప్పటికీ పలు గ్రామాలు నీటి ముంపులోనే ఉండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వరద సహాయ, పునరావాస వ్యయం కింద జిల్లా కలెక్టర్లకు అదనపు నిధులు విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు రూ.5 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో ఉభయగోదావరి జిల్లాలకు చెరో 2 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం […]