బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో అమీర్‌ఖాన్ హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ ప్రివ్యూ షోకు అమీర్‌ఖాన్, చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్ కూడా హాజరయ్యారు. ఈ సినిమా వీక్షించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య చాలా […]
రష్యాకు చెందిన టెన్నిస్ మాజీ స్టార్ మరియా షరపోవా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు షరపోవాకు పెళ్లి కాలేదు. అయితే ఆమె పెళ్లి కాకుండానే తల్లి కావడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే భర్త అలెగ్జాండర్ గిల్క్స్‌తో కలిసి కొంతకాలంగా ఆమె సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె జూలై 1వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా షరపోవా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. తమ బాబుకు థియోడర్ అని పేరు పెట్టినట్లు […]
మీరు శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో అందరినీ కౌగిలించుకుంటూ ఉంటాడు. అలా చేస్తే మనసులోని ఆందోళన మటుమాయం అవుతుందని చెప్తుంటాడు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. కాకపోతే ఆ సినిమాలో హీరో ఉచితంగా కౌగిలించుకుంటే.. రియల్ లైఫ్‌లో మాత్రం ఆ వ్యక్తి కౌగిలించుకుంటే గంటకు ఇంత అని వసూలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తమ మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోలేక ఒంటరితనం అనుభవిస్తున్న వారికి భరోసా కల్పించేలా బ్రిటన్ […]
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా తమ రాజ్యాంగంలోని కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను తొలగిస్తూ 2019 డిసెంబరులో చేసిన సవరణలను ఆమోదించాలంటూ 2019లో దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని తన పిటిషన్‌లో బీసీసీఐ పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో వచ్చేవారం విచారణ తెలపనుంది. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జై షా పదవీకాలం సెప్టెంబరుతో ముగియనుంది. Read Also: Telangana: తెలంగాణలో […]
వరల్డ్ వాటర్‌ఫాల్ రాప్లింగ్ మూడో విడత పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చో్డ మండలంలోని గుండివాగు వద్ద 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలలో 30కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 33 టీవీ ఛానెల్స్ ఈ పోటీలను టెలికాస్ట్ చేస్తాయని చెప్పారు. ఉవ్వెత్తున దూకే జలపాత ధారల్లో తాడు సాయంతో పై నుంచి (స్ట్రెయిట్ పాయింట్) కిందకు (ఫినిష్ పాయింట్)కు చేరడాన్నే […]
బాలీవుడ్‌లో ఈ ఏడాది భారీ హిట్ అందుకున్న చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలపై వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘కింగ్స్, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంత కాలం బాలీవుడ్ […]
వన్డేల్లో నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతున్న న్యూజిలాండ్‌కు పసికూన ఐర్లాండ్ జట్టు చెమటలు పట్టించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లో శుక్రవారం జరిగిన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (115 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (74 పరుగులు, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిన్ అలెన్ (33), కెప్టెన్ లాథమ్ (30), గ్లెన్ ఫిలిప్స్ (47) […]
గోదావరి పోటెత్తుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలు అల్లాడిపోతున్నాయి. దాదాపు లంక గ్రామాలన్నీ గోదావరి ప్రతాపానికి నీటమునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రిలీఫ్ ఆపరేషన్‌లో ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎన్ని ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు నెలకొన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 3వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది): అల్లూరి సీతారామరాజు జిల్లాలోని V.R పురం, కూనవరం గ్రామాలకు చెందిన 222 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు […]
* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. మండపేటలో కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొననున్న పవన్ * ఏపీలో నేటి నుంచి ఆలయాల్లో ఏ ఖర్చుకైనా ఆడిట్ పూర్తవ్వకుండా బిల్లులు చెల్లించకూడదని ప్రభుత్వం నిర్ణయం * బాపట్ల జిల్లా: నేడు రేపల్లె మండలం పేటేరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ * రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద పోటెత్తుతున్న గోదావరి.. ఈరోజు వరద ప్రవాహం 25 లక్షల […]
అగ్రరాజ్యం అమెరికాను నత్తలు వణికిస్తున్నాయి. అయితే అవి సాధారణ నత్తలు కావు. వ్యాధులను సక్రమింపచేసే నత్తలు. ఆఫ్రికా వాటి పుట్టినిల్లు. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ జాతి నత్తలు సైజులో చాలా పెద్దగా ఉంటాయి. వాటి సైజు 8 అంగుళాలు ఉంటుంది. పెద్దవాళ్లు పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత సైజులో నత్త ఉంటుంది. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. అయితే ఓడల్లో సరుకుల ద్వారానో లేదా మనుషుల […]