ఏపీ సీఐడీ నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు వరుస ఫోన్‌లు వెళ్తున్నాయి. ఫేక్ ట్వీట్ విషయంపై మంత్రి అంబటి రాంబాబుపై చేసిన ఫిర్యాదు అంశంలో ఉమ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకునేందుకు సీఐడీ ఫోన్‌లు చేస్తోంది. అయితే రెండు రోజులుగా సీఐడీ తనకు వరుసగా ఫోన్‌లు చేస్తుండటంపై దేవినేని ఉమ అసహనం వ్యక్తం చేశారు. నిందితుడైన మంత్రి అంబటి రాంబాబును కాకుండా.. తన వెంట పడటమేంటని ఫోన్‌లోనే దేవినేని ఉమ సీఐడీ పోలీసులపై […]
సింగపూర్ ఓపెన్‌లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటుతోంది. మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు తాజాగా సెమీ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన హాన్ యూను 17-21, 21-11, 21-19 స్కోరుతో పీవీ సింధు మట్టి కరిపించింది. దీంతో టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అటు ఈ సిరీస్‌లో మహిళల సింగిల్స్‌లో ఆదిలో సత్తా చాటిన మరో తెలుగు తేజం సైనా […]
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దళిత యువకుడు నారాయణ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సీఎస్‌కు రాసిన లేఖ కాపీని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కూడా చంద్రబాబు పంపారు. పోలీసుల దెబ్బల కారణంగానే దళిత యువకుడు నారాయణ చనిపోయాడని.. రాజకీయ ప్రత్యర్థులు, దళితులు, మైనార్టీలు, మహిళలు, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసుల దౌర్జన్యాలు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. నారాయణ మరణం ఏపీలోని ఒక […]
గోదావరి వరదలు – సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏరియల్ సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా. తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రవీణ్ కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌ను నియమించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని.. […]
ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జైమఖ్తల్ ట్రస్ట్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మఖ్తల సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మఖ్తల్ నియోజకవర్గంలోని యువతకు స్కిల్స్ డెవలప్ మెంట్ లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీహబ్ వేదికగా ‘స్కిల్ మఖ్తల్’ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఇందుకు సంబంధించిన స్కిల్ మఖ్తల్ లోగోను టీహబ్ వేదికగా ఆవిష్కరించారు. మక్తల్ మెమొరీ ఎక్స్ పర్ట్ శాలివాహన శ్రీనివాస్, తెలంగాణ […]
పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతికి సంబంధించి ప్రమాదకర పరిస్థితులను శుక్రవారం మధ్యాహ్నం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రస్తుతం పోలవరం వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే కాఫర్ డ్యామ్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని తెలిపారు. అందుకే పటిష్ట చర్యలు […]
దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఆగస్టు నెలలో కెనడాలో జరిగే అంతర్జాతీయ స్పీకర్ల సదస్సుకు సంబంధించి శుక్రవారం నాడు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తనపై ఎప్పుడూ ఉండే విధానం ఉంటుందని.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం […]
కర్ణాటకలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కే1 కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విషాదకరంగా ముగిసింది. ప్రత్యర్థి విసిరిన పంచ్‌కు కిక్ బాక్సర్ నిఖిల్ సురేష్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ముఖంపై పంచ్ దెబ్బ గట్టిగా తగిలడంతో రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. నిఖిల్ సురేష్ స్వస్థలం మైసూరు. అతడి వయసు 23 ఏళ్లు. ఈ నేపథ్యంలో కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: Jos Buttler: కోహ్లీపై విమర్శలు.. బట్లర్ ఘాటు వ్యాఖ్యలు కాగా రాష్ట్ర […]