ICC ODI Rankings: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకుల్లోనూ జోరు చూపించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను నాలుగో స్థానానికి నెట్టిన టీమిండియా 109 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. పాకిస్థాన్ ఖాతాలో 106 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్ 128 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియాతో వన్డే సిరీస్ కోల్పోయినా 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. అటు 101 పాయింట్లతో ఆస్ట్రేలియా […]
Girl students remove innerwear at neet 2022 examination centre: దేశవ్యాప్తంగా ఆదివారం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్-2022 జరిగింది. నీట్ పరీక్ష సందర్భంగా కేరళ రాష్ట్రం కొల్లాంలోని మార్తోమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్‌లో 100 మంది విద్యార్థినుల పట్ల నిర్వాహకులు అనుచితంగా ప్రవర్తించారు. లో దుస్తులు(బ్రా) విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో పరీక్షకు వచ్చిన విద్యార్థినులంతా అవాక్కయ్యారు. అయితే పరీక్షకు సమయం అవుతుండడంతో చేసేదేమీ […]
Chandra Babu Fires on AP Government: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. కోవిడ్ నిధులనూ దారి మళ్ళించడం మానవత్వం లేని జగన్ పాలనకు నిదర్శనమని చంద్రబాబు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించిందని చంద్రబాబు వివరించారు. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని.. దారి మళ్లించిన నిధులను వెంటనే SDRF ఖాతాలో జమ చెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ ఇష్టానుసార […]
YCP MP Vijaya Sai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకోవడంపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని గతంలో చంద్రబాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడు ఆ ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఇకపై ఎప్పటికీ సీఎం కాలేనని […]
Ben Stokes Retirement to ODI Cricket: ఇంగ్లండ్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ షాకిచ్చాడు. అనూహ్యంగా వన్డేల నుంచి తాను తప్పుకుంటున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డే తనకు చివరిదని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ స్టోక్స్ సొంత మైదానం డర్హామ్‌లో జరగనుంది. అయితే ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బెన్ స్టోక్స్ వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు తనకు సహకరించిన తోటి […]
MarBurg Virus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. మరోవైపు మంకీపాక్స్ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఆఫ్రికా ఖండంలోని ఘనాలో అత్యంత వ్యాప్తి కలిగిన ‘మర్‌బర్గ్’ వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు ఘనా ప్రభుత్వం వెల్లడించింది. వారితో సన్నిహితంగా మెలిగిన 98 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపింది. మృతుల నమూనాలు సేకరించి సెనెగల్‌లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించగా […]
Telugu Desam Party Leader Devineni Uma: పోలవరం ప్రాజెక్టు విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంచడానికి ఎవరి అనుమతి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాఫర్ డ్యాం ఎత్తు పెంచడానికి పీపీఏ అనుమతిచ్చిందా లేదా సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చిందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ చెప్పారంటూ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచేస్తామని మంత్రి అంబటి రాంబాబు చెప్పడం […]
Telugu Desam Party MP Ram Mohan Naidu: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ఎన్నికలు జరగడంతో పార్లమెంట్ హాలు సందడిగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ క్రికెటర్లలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీసుకున్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల రాజ్యసభకు పంజాబ్ కోటాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అటు ఇప్పటికే […]
Nirmala Sitaraman on Crypto Currency: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోకరెన్సీ కోసం నిబంధనలను రూపొందించాలని, వాటిని నిషేధించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రభుత్వాన్ని కోరిందని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క్రిప్టో కరెన్సీని నిషేధించడం కుదరదని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఇతర దేశాల సహకారం ఉంటేనే క్రిప్టో […]