CM KCR: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశాల కుట్ర.. అందుకే భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Sensational Comments: భద్రాచలం పర్యటనలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని ఆరోపించారు. దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని.. దీని వెనుక కుట్రలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గతంలో లేహ్‌లో ఇలా చేశారని.. ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారని.. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు. అటు గోదావరికి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని.. ఈనెల 29 వరకు ప్రతిరోజూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని.. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.
Read Also: Corona Vaccination: ఇండియా రికార్డ్ .. వ్యాక్సిన్ కార్యక్రమంలో 200 కోట్ల డోసులు పూర్తి
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
అంతకుముందు భద్రాచలంలో గోదావరి బ్రిడ్జిపై సీఎం కేసీఆర్ శాంతిపూజలు నిర్వహించారు. అనంతరం కరకట్టను పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. త్వరలోనే భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో కంటే కనివినీ ఎరుగని వరదలు వస్తున్నాయని.. 50 అడుగులు గోదావరి వచ్చిన కొన్ని ప్రాంతాలు మునుగుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!