Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi: తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్టార్ హీరో ధనుష్ కూడా దళపతి విజయ్ బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా? సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారా? అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ధనుష్ ‘ఓం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి స్టేజ్ మీదే ధనుష్‌కు చేసిన ఓ ఎమోషనల్ రిక్వెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వేదికపై మైక్ అందుకున్న సాయి పల్లవి, ఆడిటోరియం బయట నెలకొన్న వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోయారు. “నేను ఇక్కడికి వస్తున్నప్పుడు దారి పొడవునా జెండాలు చూశాను. అది చూస్తుంటే ఏదో సినిమా వేడుకలా కాకుండా ఒక పెద్ద రాజకీయ సభలా అనిపించింది” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆ టైంలో ఆడిటోరియంలోని ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా కేకలతో హోరెత్తించారు.
ఆ తర్వాత ధనుష్ వైపు తిరిగిన సాయి పల్లవి అత్యంత ఆత్మీయంగా, ఎమోషనల్‌గా ఒక విజ్ఞప్తి చేశారు. “సర్, మీరు జీవితంలో ఏం చేసినా, ఏ రంగంలోకి వెళ్లినా మీకు అంతా మంచే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నాలోని ఒక నటి మాత్రం మిమ్మల్ని ఒకటే కోరుకుంటోంది” అంటూ అసలు విషయాన్ని చెప్పారు. దళపతి విజయ్ ప్రస్తావన తెస్తూ.. “ఇప్పటికే విజయ్ సర్ రాజకీయాల్లోకి వెళ్తూ, ఇకపై సినిమాలు చేయనని ప్రకటించారు. అది ఒక పెద్ద లోటు. కనీసం ధనుష్ సర్ అయినా సినిమాల్లో కొనసాగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను” అని సాయి పల్లవి అన్నారు. మంచి కథలకు, ప్రేక్షకులకు ధనుష్ లాంటి రియాలిస్టిక్, గొప్ప నటులు చాలా అవసరమని, దయచేసి యాక్టింగ్‌ని మాత్రం ఆపొద్దని ఆమె కోరారు. ఒకవేళ ఆయన కూడా సినిమాలు వదిలేస్తే, సినీ పరిశ్రమ ఒక అద్భుతమైన నటుడిని కోల్పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాయి పల్లవి ఇంత ప్రేమగా, నిజాయితీగా చేసిన ఈ రిక్వెస్ట్‌కు అక్కడున్న ఆడియన్స్ అందరూ చప్పట్లతో వారి సపోర్ట్‌ను తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతుండగా, ‘నిజమే ధనుష్ సర్.. మీరు సినిమాలు వదలొద్దు’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Also Read
- Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
- Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
- Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
https://t.co/vLLvMFzHj4
— LK Backup (@iammoviebuff005) November 15, 2026
తాజావార్తలు
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
-
Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
-
US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!