Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్ టీ20 లీగ్‌లో భారత్ ఫైనల్ కు చేరింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో ఓడిపోయినా భారత్‌కు రజతం వస్తుంది. సెమీఫైనల్లో టాస్ గెలిచిన భారత మహిళలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ […]
Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలపై మహిళలు ధైర్యంగా పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరితే బూతులు తిడతారా అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వరద బాధితుల సమస్యలపై మాట్లాడిన పలువురు జనసేన వీర మహిళలను శనివారం నాడు ఆయన సత్కరించారు. కోనసీమ జిల్లా గంటి పెదపూడిలో వరద బాధితుల సమస్యలను జనసేన వీరమహిళలు సీఎం జగన్ దృష్టికి […]
Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు మరో రెండు పతకాలు వచ్చాయి. అవినాశ్ సేబుల్ 3 వేల మీటర్ల రేస్ వాక్‌లో వెండి పతకాన్ని గెలుచుకున్నాడు. అటు మహిళల 10 వేల మీటర్ల వాకింగ్ పోటీల్లో ప్రియాంక గోస్వామి కూడా సిల్వర్ మెడల్‌ను సాధించింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 28కి చేరింది. ఇందులో 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. Read […]
Vishnu Vardhan Reddy: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అమరావతి రాజధానితో పాటు రాయలసీమ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. రాయలసీమ నుంచే ఎక్కువమంది ముఖ్యమంత్రులు కావడంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ర్టంలో ఐపీఎస్ లేదు వైసీపీనే ఉందని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు మాట్లాడిందే, చెప్పించే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంపై […]
CM KCR Press Meet: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో ఆగస్టు15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండగా.. ఆగస్టు 15 నుంచి ఈ సంఖ్య 46 లక్షలకు చేరుతుందన్నారు. 57 సంవత్సరాలున్న వారికి ఆసరా పెన్షన్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పాత, కొత్త పెన్షనర్లకు బార్‌కోడ్‌లతో […]
దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని.. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని, మిషన్ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని.. వీటిని పూర్తి చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం వైఖరికి నిరసనగానే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం లేదని కేసీఆర్ వివరణ ఇచ్చారు. దేశంలో ఉచితాలను […]
TTD Temple in Mumbai: దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా త్వరలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నిధులు, భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. ఇప్పుడు భూమి పూజకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 21న భారీ ఎత్తున ముంబైలో టీటీడీ ఆలయానికి భూమి పూజ చేపట్టాలని అధికారులు తలపెట్టారు. ఈ మేరకు పలు పార్టీలకు […]
TikTok: 2020లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో కనుమరుగైన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ మళ్లీ ఇండియాలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌తో ముంబైకి చెందిన Sky esports కంపెనీ చర్చలు జరిపింది. టిక్‌టాక్ త్వరలోనే ఇండియాకు వస్తుందని ఆ కంపెనీ సీఈవో శివనంది నిర్ధారించారు. అలాగే BGMI గేమ్ కూడా 100 శాతం తిరిగి ప్రారంభమవుతుందని శివనంది తెలిపారు. కాగా గత నెలలో Hirandandani కంపెనీతోనూ బైట్‌డ్యాన్స్ చర్చలు జరిపింది. Read […]
Vijaya Sai Reddy: రాజ్యసభలో మంగళవారం నాడు కీలక చర్చ నడించింది. కార్పొరేట్ కంపెనీల ట్యాక్స్ ఎగవేతపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నందున దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటో వివరించాలని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థలైన డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), […]
Heath Davis Sensational Statement: న్యూజిలాండ్ మాజీ స్టార్ క్రికెటర్ హీత్ డేవిస్ (50) సంచలన ప్రకటన చేశాడు. ఇన్నాళ్లు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి రహస్యంగా ఉంచిన ఓ విషయాన్ని రివీల్ చేశాడు. తాను స్వలింగ సంపర్కుడిని (గే) అని హీత్ డేవిస్ వెల్లడించాడు.ఈ విషయం తనతో ఉన్నవాళ్లందరికీ తెలుసని అతడు తెలిపాడు. దీని గురించి బయట ప్రపంచానికి చెప్పడానికి చాలా కాలం పాటు తనలో తానే కుమిలిపోయాయనని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇక […]