Central Government: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.4,721 కోట్ల నిధులు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో పన్నులను అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అందులో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇందులో భాగంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు రెండో విడత పన్నుల వాటాను విడుదల చేసింది. తొలి వాటా కింద దేశంలోని 28 రాష్ట్రాలకు రూ.58,332 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా రెండో వాటా కింద రూ.1,16,665.75 కోట్లను విడుదల చేసింది. రెండో వాటా కింద విడుదలైన నిధులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.4,721 కోట్లను విడుదల చేయగా, తెలంగాణ రాష్ట్రానికి రూ.2,452 కోట్లు విడుదలయ్యాయి.
Read Also: Farmer Got Diamond: రైతు పంట పండింది.. రూ.2 కోట్ల వజ్రం దొరికింది
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటా విడుదలే నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలకు బుధవారం విడుదలైన రెండో విడత పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.20,928 కోట్లు విడుదల కాగా… ఆ తర్వాత స్థానంలో నిలిచిన బీహార్‌కు రూ.11,734 కోట్లు విడుదలయ్యాయి. గోవాకు అత్యల్పంగా రూ.450.32 కోట్లు విడుదలయ్యాయి. కాగా స్థానిక సంస్థలకు గత ఏడాదిగా కేంద్రం నిధులు విడుదల కాలేదని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక సంస్థలకు గత ఏడాది రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంతవరకు విడుదల కాలేదని తెలిపింది. గ్రామ పంచాయతీలకు రూ. 678.65 కోట్లు, మండల జిల్లా పరిషత్ లకు రూ. 290.86 కోట్లు, మొత్తం బకాయిలు రూ.969 కోట్లు ఉన్నట్లు ఇటీవల ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.

తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!