Vangalapudi Anitha: అనుకున్నట్లే జరిగింది.. డర్టీ ఎంపీకి సచ్చీలుడు సర్టిఫికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రిపోర్టుపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అనుకున్నట్లే జరిగిందని.. తప్పును కప్పిపుచ్చడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. డర్టీ ఎంపీ మాధవ్‌కు సచ్చీలుడు అన్న సర్టిఫికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. దీన్ని సమర్థిస్తున్నారా లేదా అనేది సీఎంగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర మహిళల దెబ్బ వైసీపీకి గట్టిగా తగులుతుందని వంగలపూడి అనిత హెచ్చరించారు.
అనుకున్నట్లే జరిగింది. తప్పుని కప్పిపుచ్చడానికి చేయాల్సినవి అన్నీ చేస్తున్నారు. డర్టీ ఎంపీ మాధవ్ కు సచ్చీలుడు అన్న సర్టిఫికేట్ ఇస్తున్నారు. దీన్ని సమర్థిస్తున్నారా లేదా అనేది సీఎం గా, ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
1/2Also Read
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
— Anitha Vangalapudi (@Anitha_TDP) August 10, 2022
మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కూడా ఈ అంశంపై స్పందించారు. ఎంపీ న్యూడ్ వీడియోకు సంబంధించి ప్రభుత్వానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందని.. ఆ రిపోర్టు ఎంపీ మాధవ్‌కు వ్యతిరేకంగా వచ్చిందని.. కాబట్టే అనంతపురం ఎస్పీతో మాట్లాడించారని ఆరోపించారు. తాడేపల్లి నుంచి వెళ్లిన స్క్రిప్టును అనంతపురం ఎస్పీతో చెప్పించారని విమర్శలు చేశారు. న్యూడ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని.. రిపోర్టులో ఒరిజనల్ అని తేలితే చర్యలు ఉంటాయని గతంలో వైసీపీ వాళ్లే చెప్పారని.. ఇప్పుడు ల్యాబ్‌కు అసలు వీడియోనే పంపలేదని ఎస్పీ మాట మార్చారని బోండా ఉమ అన్నారు. హోంమంత్రి మాట ఏమైంది..? సకల శాఖ మంత్రి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అసలు ఏ టెక్నికల్ గ్రౌండ్స్ మీద అనంతపురం ఎస్పీ మాట్లాడారని నిలదీశారు. తానే ఫిర్యాదు చేశానని గోరంట్ల మాధవ్ చెప్పారని.. కానీ ఎస్పీ మాత్రం తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్తున్నారని బోండా ఉమ పేర్కొన్నారు. ఎంపీ మాధవ్ వీడియో మార్ఫింగ్ అయ్యిండొచ్చు.. ఎడిటింగ్ అయ్యిండొచ్చు అని భావిస్తున్నామని ఎస్పీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. వీడియో ఎనాలసిస్ చేస్తే.. ఆ వీడియో పుట్టు పూర్వత్తరాలు తీయవచ్చని.. వైసీపీ ప్రజల్లో పతనమవుతోందని.. అందుకే ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించారన్నారు.
Read Also: Gorantla Madhav: వీడియోను సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తా.. వాడొక అరగుండు వెధవ
అసలు వీడియోలో ఎంపీనో కాదో అనే విషయాన్ని గుర్తు పట్టలేకపోతున్నామని ఎస్పీ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని బోండా ఉమ అన్నారు. ఒరిజినల్ వీడియోకు ఒకరు వేరేవారికి పంపితే.. వాళ్లు వీడియో చూస్తుంటే దాన్ని మూడో వ్యక్తి రికార్డ్ చేశారంటున్నారని.. ఇంతకీ ఎవరా ముగ్గురు అని బోండా ఉమ సూటిగా ప్రశ్నించారు. ఎవ్వరి ఫోన్లల్లోనూ ఒరిజినల్ వీడియోలు ఉండవు అని.. అయినా విచారణ చేపట్టడం లేదా అని నిలదీశారు. గోరంట్ల మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదని.. మాధవ్‌ను రక్షించేందుకే పోలీసులు విచారణ చేపట్టారన్నారు. ఇది వీడియో కాలా..? రికార్డెడ్ వీడియోనా..? అనేది కూడా తేలాలన్నారు. మాధవ్ ఎపిసోడు నుంచి దృష్టి మళ్లించేందుకు రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. చింతమనేని గురించి ఇప్పుడెందుకు ప్రస్తావన అని.. మోకాలికి బోడిగుండుకు ముడి వేయడం దేనికి అని బోండా ఉమా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!