Indian Railways: రైళ్లలో ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలంటూ వస్తున్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. రైళ్లలో ప్రయాణించే చిన్నారుల టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ప్రకటించింది. ఒకటి నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లలకు పెద్దలకు వర్తించే టికెట్ ధరలు వర్తిస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలందరూ గతంలో తరహాలోనే రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది. అయితే ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కేటాయించడం […]
IPL 2023: ఐపీఎల్‌కు ఇంకా చాలానే సమయం ఉంది. అయినా పలు జట్లు ఇప్పటి నుంచే టైటిల్ వేటను ప్రారంభించాయి. ఈ సందర్భంగా పలు మార్పులను చేపట్టాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచ్ మారనున్నాడు. ఇప్పటివరకు కేకేఆర్ హెడ్ కోచ్‌గా సేవలు అందించిన న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో కేకేఆర్ కొత్త కోచ్‌ను నియమించింది. ఈ మేరకు టీమిండియా […]
Congress Bharat Jodo Yatra: 2024 సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకుని దేశంలో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం జరగనున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో సగం […]
Nara Lokesh: విజయవాడలో చిరు వ్యాపారులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చిరు వ్యాపారులను కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఎదుర్కొన్నాం కానీ.. జగన్ వైరస్‌ను ఎదుర్కోలేకపోతున్నామని లోకేష్ చురకలు అంటించారు. ఏపీలో జగన్, అతని చుట్టుపక్కల ఉన్న నలుగురిదే రాజ్యం […]
YSR Netanna Nestam: ఏపీలో మరో పథకం కింద నగదు పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 23వ తేదీన కృష్ణా జిల్లా పెడనలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటికే నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. లబ్ధిదారుల జాబితాలను సచివాలయాలకు పంపించారు. కాగా సొంత మగ్గం […]
FlipKart: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) భారీ జరిమానా విధించింది. సరైన నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను వినియోగదారులకు విక్రయించినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని ఫ్లిప్ కార్ట్‌ను కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ ఆదేశించింది. నాణ్యతలేని వస్తువులను విక్రయించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో నాసిరకం కుక్కర్లు విక్రయించారని దాఖలైన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ మేరకు […]
Team India: వచ్చే నాలుగేళ్ల పాటు టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఈ మేరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ)ను ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నాలుగేళ్లలో భారత్ భారీ స్థాయిలో మ్యాచ్‌లను ఆడబోతోంది. 2023, మే నుంచి 2027, ఏప్రిల్ మధ్య 38 టెస్టులు, 39 వన్డేలు, 61 టీ20లు ఆడనుంది. ఇవి కాకుండా ఐసీసీ ఈవెంట్లు అదనం. అంటే వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీలు […]
National Anthem: పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రముఖులందరూ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ గుల్ షహీద్ పార్క్ వద్ద కూడా పతాకావిష్కరణ చేయగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్ ఈ వేడుకకు హాజరయ్యారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఎంపీ హసన్ బిగ్గరగా జనగణమన పాడుతూ అందరిలోనూ దేశభక్తి రేకెత్తించేందుకు ప్రయత్నించారు. రెండు లైన్లు పాడాడో లేదో తర్వాత లైన్స్ రాలేదు. దీంతో […]
Hindupuram: హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నడుం బిగించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో ఆయన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను హిందూపురం వాడినే అని… మనలో మనకి అమరికలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. చలివెందులలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సేవలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని […]
South Central Railway: కడప మీదుగా గుంటూరు-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రైలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. గుంటూరులో ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12:45 గంటలకు చేరుతుందన్నారు. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి […]