National Anthem: పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రముఖులందరూ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ గుల్ షహీద్ పార్క్ వద్ద కూడా పతాకావిష్కరణ చేయగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్ ఈ వేడుకకు హాజరయ్యారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఎంపీ హసన్ బిగ్గరగా జనగణమన పాడుతూ అందరిలోనూ దేశభక్తి రేకెత్తించేందుకు ప్రయత్నించారు. రెండు లైన్లు పాడాడో లేదో తర్వాత లైన్స్ రాలేదు. దీంతో పక్కవాళ్ల మొహం చూశారు. వాళ్లకూ ఏమీ రావడం లేదు.
Read Also: Heart Attack : కార్డియాక్ అరెస్ట్ కు కారణాలేంటి..?
జాతీయ గీతంలోని వింధ్య హిమాచల వరకు పాడి ఇక గుర్తుకు రాకపోవడంతో దిక్కులు చూశారు. జేబులోంచి ఫోన్ తీసి చూద్దామనుకునేలోపు పక్కన ఎవరో ‘జయహే.. జయహే’ అనడంతో దాంతో జాతీయ గీతాన్ని ముగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీని ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పట్రా కూడా పోస్ట్ చేశారు. ఎంపీ హసన్‌తో పాటు ఆయన పార్టీ నేతలు, మద్దతుదారులు కూడా జాతీయ గీతాన్ని పాడలేకపోయారని.. మన నేతల పరిస్థితి ఇలా ఉందని బీజేపీ నేత సంబిత్ పట్రా ఎద్దేవా చేశారు. అయితే గతంలో బీజేపీ నేతలు కూడా జాతీయ గీతాన్ని సరిగ్గా పాడలేకపోయారంటూ సమాజ్ వాదీ పార్టీ నేతలు బీజేపీపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.