Perni Nani Fires on Chandrababu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. రాజకీయాల కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఆయన రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి అబద్ధాలే మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. అశ్లీల చిత్రాలను సృష్టించడం, ప్రచారం చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోపై ఇదిగో సర్టిఫికేట్ తెచ్చాం…అమెరికా ఇచ్చింది అంటూ టీడీపీ నేతలు మాట్లాడారని.. అదేమన్నా అమెరికా FBI […]
Botsa Satyanarayana: ఫేస్ రికగ్నిషన్ యాప్ విషయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ విషయంలో ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని.. నిమిషం ఆలస్యం అయితే ఆబ్సెంట్ వేస్తారన్నది వాస్తవం కాదన్నారు. మూడు సార్లు ఆలస్యంగా వస్తే నాలుగోసారి హాఫ్ డే కింద పరిగణించటం […]
Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎనర్జీ అసిస్టెంట్లు, జేఎల్‌ఎం గ్రేడ్-2 ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాబ్ ఛార్ట్‌ని విస్మరించి కట్టుబానిసల్లా వాడుకోవడంతో ఎనర్జీ అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని లోకేష్ ఆరోపించారు. సెలవులు, పండగలు, పబ్బాల ఊసే లేకుండా చేశారని.. దీంతో రాత్రి, […]
Yuzvendra Chahal: ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పేరు మార్మోగిపోతోంది. చాహల్, అతడి భార్య ధనశ్రీ మధ్య విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. చాహల్ భార్య ధనశ్రీ సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడం కలకలం రేపింది. ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన భర్త ఇంటిపేరు ‘చాహల్’ను తొలగించింది. దీంతో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సెలబ్రిటీలు పేర్లు మార్చుకోవడం విడాకులకు దారి తీస్తుందని ఇటీవల పలు ఘటనలను నెటిజన్‌లు గుర్తుచేస్తున్నారు. గత […]
Ind Vs Zim: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. తర్వాత పట్టు సడలించారు. దీంతో జింబాబ్వే టెయిలెండర్లు రాణించారు. సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్ తొలి మ్యాచ్‌లోనే సత్తా […]
Kodali Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని జగన్‌పై చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా అధికారాన్ని కట్టబెట్టారని.. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పప్పు నాయుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. అటు పప్పు నాయుడు కుమారుడు తుప్పు నాయుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడని.. వారంలో ఏదో జగన్ వ్యవహారం బయటపెడతానని వాగుతున్నాడని.. అదేదో మొన్న […]
Naga Babu: ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా మెగా గ్రాండ్ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు నాగబాబు స్పష్టం చేశారు. 20 ఏళ్లకు పైగా మెగా అభిమానులు చూపించే ఆదరాభిమానాలను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్లు నాగబాబు తెలిపారు. తెలుగులో చెప్పాలంటే ఇదొక జాతర మాదిరిగా ఉంటుందన్నారు. గోవా […]
Wipro: ప్రముఖ ఐటీ రంగ సంస్థ విప్రో తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గడంతో ఈ ఏడాది వేరియబుల్ పే నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని విప్రో ఖండించింది. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విప్రో స్పష్టం చేసింది. తాము తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. అనుకున్న ప్రకారమే తమ ఉద్యోగులకు వేరియబుల్ పే అందిస్తామని తెలిపింది. మీడియాలో వస్తున్నట్లు వేతనాల పెంపును […]
Teacher On Flag Hoisting: స్వాతంత్ర దినోత్సవం రోజు మతాలకతీతంగా, కులాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ జెండా వందనం చేస్తారు. మేరా భారత్ మహాన్ అంటూ గర్వం వ్యక్తం చేస్తారు. అయితే ఓ మహిళ మాత్రం తాను జెండా వందనం చేసేది లేదంటూ తెగేసి చెప్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ఓ పాఠశాలలో తమిళసెల్వి అనే మహిళ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పంద్రాగస్టు రోజు స్కూల్‌కు హాజరుకావాల్సిన ఆమె సెలవు పెట్టి గైర్హాజరు అయ్యారు. అయితే […]
Hindupuram MLA Balakrishna: హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో బుధవారం నాడు టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పనిచేశారని.. ఆయన సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. ఏం మొహం పెట్టుకుని జెండా ఆవిష్కరణకు వచ్చారని ప్రశ్నించారు . టీడీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుంటే పోలీసులు […]