ICICI Bank: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేట్లను సవరించినట్లు వివరించింది. 7 రోజుల నుండి 29 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.75 శాతం వడ్డీ రేటును ఇస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. […]
Gorantla Madhav: తన వీడియో ఫేక్ వీడియో అని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే నిజమని తేలిందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్టుతో మరోసారి టీడీపీ దొరికిపోయిందని.. అమెరికా నుంచి ఓ ఫేక్ రిపోర్ట్ తెప్పించారని.. ఈ రిపోర్టుతో చంద్రబాబు నానా యాగీ చేశారని ఆరోపించారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ అక్కడి నుంచి తెప్పించిన వివరాలతో టీడీపీ పరిస్థితి కుడితిలో పడిన బల్లి లాగా తయారైందన్నారు. ఓటుకు నోటు కేసులో […]
Andhra Pradesh Volunteers: ఏపీలో ప్రతినెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు వాలంటీర్లే ఇంటింటికీ వెళ్లి ఫించన్ ఇస్తున్నారు. అయితే కొందరు వాలంటీర్స్ అమాయకపు వ్యక్తులను మోసం చేస్తూ బాగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండలం కామన్ దొడ్డిలో వాలంటీర్లు చేతి వాటం ప్రదర్శించారు. నూతనంగా మంజూరైన ఫించన్ ఇచ్చినట్టే ఇచ్చి ఫోటోలు దిగి వాలంటీర్లు వెనక్కి తీసుకున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫించన్ రావడంతో […]
Asia Cup 2022: ఈనెల 27 నుంచి దుబాయ్ వేదికగా ఆసియాకప్ 2022 జరగనుంది. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు మరో క్వాలిఫయర్ జట్టు కూడా పాల్గొంటాయి. ఈ ఏడాది జరగబోతున్న ఆసియాకప్ 15వది. అంటే 2018 వరకూ 14 టోర్నీలు జరిగాయి. మొదటిసారి ఆసియాకప్ 1984లో జరిగింది. 2016లో తొలిసారి ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. అందులో ఇండియా విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2018లో చివరిసారి […]
Trisha: హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా త్రిష పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపుగా అందరూ అగ్రహీరోల సరసన నటించింది. చిరంజీవితో స్టాలిన్, బాలయ్యతో లయన్, నాగార్జునతో కింగ్, వెంకటేష్‌తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బాడీగార్డ్, ప్రభాస్‌తో వర్షం, పౌర్ణమి.. మహేష్‌తో అతడు, ఎన్టీఆర్‌తో దమ్ము లాంటి సినిమాలు చేసింది. ఇప్పటికీ అవకాశం వస్తే లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తోంది. తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి […]
Team India Record: జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మేరకు టీమిండియా ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌ను 10 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అప్పుడు భారత ఓపెనర్లు 197 పరుగుల టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా ఛేదించారు. ఇప్పుడు జింబాబ్వేపై 192 పరుగుల టార్గెట్‌ను కూడా వికెట్లేమీ కోల్పోకుండా ఛేజ్ చేసి గెలిపించారు. […]
Andhra Pradesh: గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 10,032 గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్‌లుగా నోటిఫై చేస్తున్నామని.. శిక్షణ పొందిన సిబ్బందిని ఈ క్లినిక్‌లలో నియమిస్తామంది. ఇప్పటికే 8,500 మంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేశామని.. హెల్త్ క్లినిక్‌ల కోసం 8500 భవనాలు నిర్మిస్తున్నట్లు, 14 రకాల వైద్య పరీక్షలు గ్రామస్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామంది. ఈ మేరకు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్‌సీ, […]
Pattabhi: ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ఈ వీడియోపై ఇటీవల టీడీపీ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్వయంగా ప్రకటించడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలో ఎడిటింగ్ లేదని జిమ్ స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక వాస్తవమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టం చేశారు. ఈ అంశంలో త్వరలోనే మరిన్ని […]
Chahal- Dhanashree: ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అతడి పేరును నెటిజన్‌లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం అతడి భార్య ధనశ్రీ వర్మ. ఆమెతో చాహల్ బంధం తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీవర్మ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరికీ లింక్ ఉన్నట్లు నెటిజన్‌లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారం ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి […]
Ind Vs Zim: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 190 పరుగుల విజయ లక్ష్యాన్ని ఊదిపడేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు తీసి జింబాబ్వేను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ […]