Andhra Pradesh RGF: కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) గురించి అందరికీ తెలుసు. కేజీఎఫ్ సినిమాతో ఈ విషయం విశ్వమంతా తెలిసింది. అయితే ఏపీలో RGF ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆర్జీఎఫ్ అంటే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ . నష్టాల కారణంగా రెండు దశాబ్దాల క్రితం ఆర్జీఎఫ్‌కు తాళం పడగా.. ఇప్పుడు మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రామగిరి బంగారు గనుల కోసం టెండర్లు మెుదలయ్యాయి. ఆగస్టు నెలాఖరులో టెండర్లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం […]
Gorantla Madhav Video: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సైబర్ క్రైమ్ కార్యాలయానికి ఫిర్యాదుతో కూడిన ఈ-మెయిల్‌ను పంపారు. ఈ ఫిర్యాదుతో పాటు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను న్యాయవాది లక్ష్మీనారాయణ జత చేశారు. ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు రెండు ప్రధాన పార్టీల […]
Ratan Tata: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంలో ముందుంటారు. తాజాగా ఆయన గుడ్ ఫెల్లోస్ అనే స్టార్టప్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. మంగళవారం జరిగిన ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభోత్సవంలో రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటరితనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక తోడుంటే బాగుండు అని ఒంటరిగా సమయం గడిపే వరకు.. ఒంటరితనమంటే తెలియదని రతన్ టాటా వ్యాఖ్యానించారు. అలాగే వాస్తవంగా వయసు […]
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 18వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు మినహా మిగతా అన్ని రోజుల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. Read Also: […]
Super Vasuki Train: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 15న అతి పెద్ద రైలును నడిపి భారతీయ రైల్వే రికార్డు సృష్టించింది. సాధారణంగా గూడ్స్ బండికే 100 అంతకంటే ఎక్కువ బోగీలు కనిపిస్తుంటాయి. గూడ్స్ ట్రైన్ వెళ్తుంటే కొంతమంది సరదాగా బోగీలు లెక్కపెడుతుంటారు. అయితే ఆగస్టు 15న ఇండియన్ రైల్వేస్ నడిపిన రైలుకు ఎన్ని బోగీలు ఉన్నాయో తెలిస్తే […]
Minister Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్వాతంత్ర్య స్ఫూర్తితో జనసేన స్థాపించలేదని ఆరోపించారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా కొమ్ముకాయడానికే పార్టీ స్థాపించాడని.. ప్రస్తుతం ఆ విధంగానే పవన్ అడుగులు వేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ విచిత్రమైన రాజకీయ రాజకీయాలు చేస్తున్నారని.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పవన్ విన్యాసాలు ఉన్నాయని చురకలు అంటించారు. పవన్ అసలు నీకు స్వాతంత్య్రం […]
Rohit Sharma: ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీమిండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా భారతీయులకు విషెస్ తెలియజేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ జాతీయ జెండాను పట్టుకుని ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి విషెస్ తెలిపాడు. అయితే రోహిత్ శర్మ పోస్ట్ చేసిన ఫోటో వివాదానికి దారి తీసింది. సదరు పోస్టులో రోహిత్ షేర్ చేసిన ఫోటో మార్ఫింగ్ అంటూ పలువురు […]
Bandla Ganesh: సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య వార్ నడుస్తోంది. ఆగస్టు 15న మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ పట్ల పెద్ద చర్చ నడుస్తోంది. కాటన్ దుస్తుల ఛాలెంజ్‌లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారో లేదో ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పట్ల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. […]
Dubai Crown Prince: ఓ దేశానికి రాజు అంటే ఆయనకు సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాజు ఎక్కడికి వెళ్లినా సకల భోగాలను అనుభవించాల్సిందే. భద్రత దృష్ట్యా వాళ్లు విమానాలు, హెలికాప్టర్లు, కార్లలో తిరుగుతుంటారు. అయితే అలాంటి రాజభోగాలను పక్కనపెట్టి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ లండన్ మెట్రోలో సామాన్య పౌరుడిగా పర్యటించి అందర్ని ఆశ్చర్యపరిచాడు. కానీ సదరు యువరాజు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన్ను […]
Asia Cup 2022: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే చాలు అభిమానుల్లో తెలియని భావోద్వేగం చోటు చేసుకుంటుంది. దీంతో అది ఎలాంటి మ్యాచ్ అయినా చూసేందుకు అభిమానులు ఎగబడతారు. కొన్నేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఆసియాకప్‌లో ఈనెల 28న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో మైదానంలో యుద్ధం లాంటి వాతావరణాన్ని చూడాలని అభిమానులు […]