Google Mobile Services: మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లు వాడుతున్నారా? అయితే గూగుల్ కీలక ప్రకటన చేసింది. 1 జీబీ ర్యామ్‌తో పనిచేసే ఫోన్లలో గూగుల్ మొబైల్ సర్వీస్(GMS) సేవలను నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. 1 జీబీ ర్యామ్/8 జీబీ ఇంటర్నల్ మెమొరీతో విడుదలయ్యే బడ్జెట్ ఫోన్ల కోసం గూగుల్ గతంలో ఆండ్రాయిడ్ గో అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్ని యాప్‌లు లైట్ వెర్షన్‌లో ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ […]
AP Bifurcation Bill: ఈనెల 27న ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఏపీ విభజన చట్టం అమలుపై చర్చించనుంది. ఈ సమావేశం ఏజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నాయి. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈనెల 27న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ […]
Santosh Kumar: ఆసియాలోనే రెండో అతిపెద్ద మర్రిచెట్టు తెలంగాణలోనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో ఈ వృక్షం నెలకొని ఉంది. 800 ఏళ్ల నాటి ఈ పురాతన వృక్షాన్ని సంరక్షించేందుకు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ నడుం బిగించారు. ఇప్పటికే ఆయన పర్యావరణ పరిరక్షణకు ఎంతో పాటుపడుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీల చేత మొక్కలు నాటిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎన్నో లక్షల మొక్కలను నాటారు. తాజాగా మహబూబ్‌నగర్ […]
Icrisat: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్రిశాట్ రైతుల పాలిట ఓ వరంలా మారింది. భారతదేశంలోనే తొలిసారిగా ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) సైంటిస్టులు జర్మనీకి చెందిన ఫ్రాన్‌హోఫర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ ఎక్స్-రే టెక్నాలజీ (EZRT) పరిశోధకుల సహకారంతో ఎక్స్‌రే రేడియోగ్రఫీని ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వేరుశనగల నాణ్యతను అంచనా వేయడానికి ఉపయోగిస్తామని సైంటిస్టులు తెలియజేశారు. దీంతో రైతులు నాణ్యమైన పల్లీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు. […]
Andhra Pradesh: ఏపీ రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసుపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణ చేపట్టగా ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో ప్రధాన […]
Infosys: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. అయితే ఇటీవల కరోనా కారణంగా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలా మంది ఉద్యోగులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు బహిర్గతమైంది. దీంతో పలు కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కూడా రంగంలోకి దిగింది. కొద్దిరోజుల కిందట తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంపెనీ నియమాలను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని […]
Girls New Strategy: కాలం మారుతున్న కొద్దీ కొందరు యువతుల మైండ్ సెట్ కూడా మారుతోంది. తమను ఎక్కువగా సుఖపెట్టిన వారినే పెళ్లి చేసుకోవాలని యువతులు భావిస్తున్నారు. సుఖపెట్టడం అంటే శారీరకంగా కాదండోయ్.. మానసికంగా. అయితే ఈ సంస్కృతి మన ఇండియాలో పుట్టింది కాదులెండి.. అమెరికాలో. అక్కడ ఓ యువతి అనేకమంది యువకులతో డేటింగ్ చేసి విసిగిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అట్లాంటాకు చెందిన డామియా విలయమ్స్ అనే యువతి ఐదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ […]
Virat Kohli: క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అంటేనే రికార్డుల రారాజు. అయితే గత కొంతకాలంగా సెంచరీలకు దూరంగా ఉన్న కోహ్లీ ఇటీవల ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌లో చెలరేగి సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. కెరీర్‌లో 71వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలోనూ కోహ్లీ క్రేజ్ మరింత పెరుగుతోంది. తాజాగా ట్విట్టర్‌లో ఫాలోవర్ల విషయంలో విరాట్ కోహ్లీ 50 మిలియన్ (5 కోట్లు) మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డును అందుకున్న తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీనే […]
Fire Accident: ఇప్పటివరకు మనం ఎలక్ట్రిక్ బైకులే కాలిపోవడం విన్నాం.. కానీ తొలిసారిగా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలోనే అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూబీ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో రూబీ లాడ్జీపైకి మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్‌లో కొందరు టూరిస్టులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హోటల్‌లో చిక్కుకుపోయిన వారిని […]
Snake in Woman Ear: శరీర భాగాలలో చెవి, కన్ను, ముక్కు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. మాములుగా చెవిలో చీమ దూరినా మనం అల్లాడిపోతాం. అలాంటిది పాము దూరితే ఇంకేమైనా ఉందా.. అంతే సంగతులు. అయితే ఓ మహిళ చెవిలోకి పసుపు రంగులో ఉన్న చిన్న పాము దూరిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాము చెవిలో దూరడమేంటని నోరెళ్లబెడుతున్నారు. అయితే మహిళ […]