Tamilnadu: అప్పుడెప్పుడో వచ్చిన ముత్యాలముగ్గు సినిమాలో ‘నువ్వు ఎంతటి రసికుడివో తెలిసెరా’ అనే పాట మీకు గుర్తుందా.. అయితే ఈ పాట తమిళనాడులోని ఓ బీజేపీ నేతకు సరిగ్గా సరిపోతుంది. బీజేపీ నేత శశికళ పుష్పకు ఆ పార్టీ నేత నుంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తమిళనాడులో బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమంలో బీజేపీ నేత పొన్ బాలగణపతి ఆమె ఎడమ చేతిని తాకేందుకు ప్రయత్నించారు. అయితే శశికళ పుష్ప ఈ ప్రయత్నాన్ని […]
Ambati Rambabu: అమరావతిపై మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి అనేదే పెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన ఐవీఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరిది ఈ రాజధాని’ అనే పుస్తకంలో ఏం రాశారో అందరూ తెలుసుకోవాలన్నారు. ఆయన బీజేపీలో ఉన్నారని.. కానీ ఆ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలని […]
Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను బుధవారం నాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 20న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 26న రాత్రి 7 గంటల నుంచి […]
Narayana Swamy: ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పశ్చిమ బైపాస్ పనులను పరిశీలించిన ౠయన రహదారి పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పశ్చిమ బైపాస్ విస్తరణ తర్వాత అమరావతి ఒక జిల్లాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. […]
AP Assembly: గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే తొలిరోజే మూడు రాజధానులపై స్వల్పకాలికంగా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఎన్నికలకు మూడు రాజధానుల రెఫరెండం అంశంతోనే వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని తెలుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాన్ని ప్రజల్లోకి సమగ్రంగా తీసుకుని వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమరావతి […]
ICC Rankings: ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు తమ హవా కొనసాగించారు. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో ఓపెనర్ బాబర్ ఆజమ్ మూడో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇండియన్ క్రికెటర్స్ సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 14వ స్థానంలో ఉన్నాడు. అటు కింగ్ కోహ్లీ 15వ స్థానానికి […]
Amaravati Assigned Lands Case: ఏపీ రాజధాని అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో ఐదుగురిని సీఐడీ ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుందరినీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అయితే వీరిలో ఇద్దరు నిందితులు కొల్లి శివరాం , గట్టెం వెంకటేష్‌ను రిమాండ్‌కు పంపేందుకు ఏసీబీ కోర్టు జడ్జి తిరస్కరించారు. ఎఫ్ఐఆర్‌లో సీఐడీ నమోదు చేసిన రెండు సెక్షన్లు కేసుకు వర్తించవని.. 41 ఏ నోటీసులు ఇచ్చి పంపాలని జడ్జి ఆదేశించారు. […]
KL Rahul: టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేస్తే టీమ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రాణించాడని.. టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లీని ఓపెనర్‌గా పంపితే ఇతర జట్లు జంకుతాయని రోహన్ గవాస్కర్ చెప్పాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ నెం.3లోనే బ్యాటింగ్ చేయాలని, అదే పర్‌ఫెక్ట్ పొజిషన్ […]
Srikanth Reddy: మూడు రాజధానుల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. అమరావతి రైతుల పాదయాత్రను తాను తప్పుపట్టడం లేదని.. పాదయాత్రలో మాట్లాడిన వాళ్ల మాటలు రాయలసీమ వాసిగా తనకు బాధ కలిగించాయని తెలిపారు. మూడు రాజధానులు చేస్తే రాయలసీమకు చుక్క నీరు ఇవ్వమని అంటున్నారని.. మూడు రాజధానులు అమలు చేస్తే మధ్య ఆంధ్ర ప్రదేశ్ కోసం ఉద్యమం చేస్తామంటున్నారని.. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. […]
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ ఏడాది తొలి 7 నెలల్లో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రకటించింది. తొలి ఏడు నెలల్లో రూ.40,361 కోట్ల పెట్టుబడులను ఏపీ రాబట్టినట్లు డీపీఐఐటీ తన నివేదికలో వెల్లడించింది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ, ఒడిశా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాలు […]