IND Vs SA: ఆసియా కప్‌లో ఘోర వైఫల్యంతో సూపర్4 దశలో ఇంటి ముఖం పట్టిన టీమిండియా టీ20 ప్రపంచకప్ సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో వరుసగా మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు వన్డేల సిరీస్‌లో కూడా తలపడనుంది. […]
Saranga Dariya Episode-07: జానపద గాయకులకు బంగారు అవకాశం కల్పిస్తోంది సారంగ దరియా . ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వెలుగులోకి రాని అనేక జానపద గీతాలకు వనిత టీవీ ప్రాచుర్యం కల్పిస్తోంది. ఏడో ఎపిసోడ్‌కు చేరుకున్న ఈ కార్యక్రమం అద్భుతమయిన సెట్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి అభినయం, సెన్సాఫ్ హ్యూమర్ హైలైట్ అని చెప్పాలి. ఆధునిక జీవితంలో జానపదాలను ఎవరూ మరిచిపోకుండా.. జానపదాల గతుల్ని.. సంగతుల్ని మీ ముందుకు తెస్తోంది. శ్రావ్యమయిన అచ్చతెలుగు […]
Road Safety World Series: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 217 పరుగులు చేసింది. రిటైర్ అయినా తమలో సత్తా తగ్గలేదని పలువురు ఆటగాళ్లు నిరూపించారు. సచిన్(16), నమన్ ఓజా(21), రైనా(33), యువరాజ్(6) పరుగులు చేయగా.. స్టువర్ట్ బిన్నీ మాత్రం చెలరేగిపోయాడు. 42 బంతుల్లోనే 6 సిక్సులు, 5 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. చివర్లో యూసఫ్ పఠాన్ 15 […]
Venkaiah Naidu: విజయవాడలో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన స్నేహితులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీకి చెందిన యువ నేత దేవినేని అవినాష్, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, […]
Andhra Pradesh: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకానికి జగన్ ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు విభిన్న ప్రతిభావంతుల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో పెళ్లి కానుక ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద ఎస్సీలకు రూ.లక్ష మేర పెళ్లి కానుక, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ. 1.20 లక్షలు, ఎస్టీలకు […]
Vishakapatnam: విశాఖపట్నం నగర శివారులోని గాజువాకలో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహానికి ముప్పు పొంచి ఉంది. 89 అడుగుల గణేష్ విగ్రహం కూలిపోతుందేమోనని స్థానిక పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ భారీ వినాయకుడి మట్టి విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోయింది. దీంతో తనిఖీలు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను పోలీసులు కోరారు. తనిఖీ చేసిన ఆర్ అండ్ బీ అధికారులు ఈ భారీ విగ్రహం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని నివేదిక […]
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏకంగా నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతి సినిమాకు కూడా ఇటీవల ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. వీటిలో సలార్, ఆదిపురుష్ సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ తాజాగా ఆస్పత్రిలో కనిపించడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రభాస్ ఆస్పత్రిలో ఐసీయూ నుంచి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో […]
T20 World Cup: అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఈనెల 16న బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లన్నీ టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును ప్రకటించేశాయి. అయితే ఇటీవల ఆసియాకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం చెందడంతో టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆల్‌రౌండర్ జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరం కావడం భారత జట్టుపై తీవ్ర […]
Meruga Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని.. ఆయనకు జబ్బుతో పాటు వయసు కూడా సహకరించడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ తమపై అసభ్యపదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. లోకేష్‌కు 40 ఏళ్లు కూడా ఉండవని.. ఆయనకు తాము కొడుకులం ఎలా అవుతామని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. లోకేష్ ఒక లుచ్చా అని.. ఆవు చేలో మేస్తే.. దూడ కూడా చేలోనే మేస్తుందని.. చంద్రబాబు గడ్డి తింటున్నారు కాబట్టి […]
Ram Charan: రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అతడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పనిచేస్తున్నాడు. ఆర్‌సీ 15 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో గుబురు గడ్డంతో, నల్ల కళ్లజోడు పెట్టుకుని చెర్రీ అద్దంలో తన అందాలను చూసుకుంటున్నాడు. ఈ లుక్‌లో రామ్‌చరణ్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. శంకర్ […]