Andhra Pradesh: రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసుపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణ చేపట్టగా ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో ప్రధాన ముద్దాయిగా మాజీ మంత్రి నారాయణను సీఐడీ పేర్కొంది. తన సొంత బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్లు సీఐడీ ఆరోపిస్తోంది.
Read Also:Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హెచ్చరిక.. అలా చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం..!!
Also Read
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయుని పాలెం, వెంకటపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు రావడంతో సీఐడీ విచారణ చేపట్టింది. రామకృష్ణా హౌసింగ్ డైరెక్టర్ ఖాతాలద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగాయని సీఐడీ అధికారులు నిర్ధారించామని తెలిపారు.
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!