Girls New Strategy: కాలం మారుతున్న కొద్దీ కొందరు యువతుల మైండ్ సెట్ కూడా మారుతోంది. తమను ఎక్కువగా సుఖపెట్టిన వారినే పెళ్లి చేసుకోవాలని యువతులు భావిస్తున్నారు. సుఖపెట్టడం అంటే శారీరకంగా కాదండోయ్.. మానసికంగా. అయితే ఈ సంస్కృతి మన ఇండియాలో పుట్టింది కాదులెండి.. అమెరికాలో. అక్కడ ఓ యువతి అనేకమంది యువకులతో డేటింగ్ చేసి విసిగిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అట్లాంటాకు చెందిన డామియా విలయమ్స్ అనే యువతి ఐదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లంటూ చేసుకుంటే 50 ఏళ్లు పైబడిన వ్యక్తినే చేసుకుంటానని సదరు యువతి తెగేసి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే తన జీవితంలో అవసరాలు తీర్చేవాడిని.. జీవితంలో బాగా స్థిరపడ్డ కోటీశ్వరుడినే పెళ్లి చేసుకుంటానని డామియా విలయమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత 50 ఏళ్లు పైబడిన చాలా మంది వ్యక్తులు డామియాను కాంటాక్ట్ అయ్యారు.
Read Also:MS Prabhu: ఆ హీరోయిన్ నెంబర్ ఇవ్వకపోతే నీ భార్యను రేప్ చేస్తా.. డైరెక్టర్ వార్నింగ్
ఈ నేపథ్యంలో డామియా విలయమ్స్ అనే యువతికి 2017లో డామియా జేమ్స్ అనే 67 ఏళ్ల పెద్దాయనతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది. ఈ మేరకు 2018లో వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే జేమ్స్ ఆమెను పెళ్లి చేసుకునేలోగా తన ప్రేయసి కోసం రూ.3 కోట్లు విలువైన ఇంటిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా రూ.36 లక్షలు విలువైన కారు కూడా కొనిచ్చాడు. తనకు పడుచుపిల్ల దొరకడంతో ఆమె కోసం ఏం చేయడానికైనా జేమ్స్ సిద్ధపడుతున్నాడు. అయితే 67 ఏళ్ల వయసులోనూ తన భర్త చురుగ్గా ఉంటున్నాడని.. లైంగికంగా కూడా తనను బాగా సుఖపెడుతున్నాడని డామియా సిగ్గుపడుతూ చెప్తోంది. జేమ్స్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల తామిద్దరికకీ ఒకరిపై మరొకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడ్డాయని డామియా చెప్పింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా పెరిగిందని తెలిపింది. దీంతో తాము ఈ సంవత్సరం లాస్ వెగాస్‌లో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం వీరి పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.