Venkatesh Iyer: దులీప్ ట్రోఫీలో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరులో వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ జట్ల మధ్య సెమీఫైనల్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెస్ట్ జోన్ బౌలర్ చింతన్ గజా విసిరిన బంతి వెంకటేశ్ అయ్యర్ మెడపై బలంగా తాకింది. గాయంతో విలవిల్లాడుతూ వెంకటేశ్ అయ్యర్ మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే అంబులెన్స్ వచ్చి అయ్యర్‌ను మైదానం నుంచి తీసుకెళ్లింది. అయితే గుడ్ న్యూస్ […]
Mumbai Indians: ఈ ఏడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ జట్టుకు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కొత్త కోచ్ రానున్నాడు. ఈ మేరకు ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్‌ను ముంబై ఇండియన్స్ నియమించింది. ఐపీఎల్ 2023 నుంచి తమ జట్టు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం మార్క్ బౌచర్‌ను నియమించినట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించింది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా బౌచర్ కీలక ఆటగాడిగా పేరు పొందాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత దక్షిణాఫ్రికాలో […]
CM Jagan: ఏపీ ఆర్ధిక వ్యవస్థపై అసెంబ్లీలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నా ఏపీ గణనీయంగా వృద్ధి సాధించిందని వెల్లడించారు. అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందని దుష్ప్రచారం కూడా చేస్తున్నారని.. రుణాలకు వడ్డీల కింద రూ. 21,499 కోట్లు, రుణంగా రూ. 14,558 కోట్లు చెల్లించామని సీఎం జగన్ వివరించారు. అలాగే రాష్ట్ర రెవెన్యూ 2021-22 ఆర్ధిక సంవత్సరానికి […]
BCCI: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జైషాలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మరో మూడేళ్లు పాటు తమ పదవుల్లో కొనసాగేందుకు రూట్ క్లియర్ చేసింది. బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు సంబంధించిన కూలింగ్ పీరియడ్ రూల్ తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ చేసిన రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్ల పాటు నిరంతర పదవీకాలం కలిగి ఉండవచ్చని […]
Reserve Bank Of India: నిత్యావసర ధరల పెంపుతో అల్లాడుతున్న సామన్యులపై మరో భారం పడే అవకాశం కనిపిస్తోంది. త్వరలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంటుందని తెలుస్తోంది. ఈనెల 30న ఆర్‌బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేట్లను ఆర్‌బీఐ పెంచనుంది. ఇప్పటికే గత రెండు సమీక్షల్లో వరుసగా వడ్డీరేట్లను ఆర్‌బీఐ పెంచింది. ఇదే జరిగితే […]
Hyderabad: ప్రస్తుతం టీమిండియా బిజీ షెడ్యూల్‌తో క్రికెట్ ఆడుతోంది. ఇటీవల ఆసియా కప్ ఆడిన భారత్ సొంతగడ్డపై ఈనెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్, ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. […]
Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి దంగేటి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది. వ్యోమగామి కావాలన్న జాహ్నవి కల సాకారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.50 లక్షల చెక్కును జాహ్నవికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు బుధవారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. తన కల సాకారం అయ్యే దిశగా ఈ మేర ఆర్థిక సాయం చేసిన సీఎం […]
Robin Uthappa: టీమిండియాకు మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఈశ్వర్ పాండే రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇండియా, కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 20 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఉతప్ప భారత్ తరపున 46 వన్డేలు, 13 టీ20లు […]
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు రెఫరెండంగా వచ్చే ఎన్నికలకు వెళ్లామంటున్న వైసీపీ ప్రభుత్వం.. దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్ చేయాలని టీడీఎల్పీలో నిర్ణయించారు. జగన్‌కు అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ విసిరింది. ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు […]
Australia: త్వరలో మూడు టీ20ల సిరీస్ కోసం భారత్ రానున్న ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టాయినీస్ జట్టుకు దూరమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాయపడ్డారు. మిచెల్ స్టార్క్ మొకాలి గాయంతో బాధపడుతుండగా.. మిచెల్ మార్ష్ చీల మండ గాయంతో, మార్కస్ స్టాయినీస్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు […]