Andhra Pradesh: దేశంలోనే ఏపీ నంబర్‌వన్.. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ ఏడాది తొలి 7 నెలల్లో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రకటించింది. తొలి ఏడు నెలల్లో రూ.40,361 కోట్ల పెట్టుబడులను ఏపీ రాబట్టినట్లు డీపీఐఐటీ తన నివేదికలో వెల్లడించింది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ, ఒడిశా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాలు 45% పెట్టుబడులు రాబట్టినట్లు డీపీఐఐటీ జూలై నివేదికలో పేర్కొంది. అయితే తొలి ఏడు నెలల్లో దేశమంతా రూ.లక్షా 71వేల 295 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇందులో ఏపీకి రూ.40,361 కోట్లు, ఒడిశాకు రూ.36,828 కోట్ల పెట్టుబడులు వచ్చాయని డీపీఐఐటీ తెలిపింది.
Read Also:Pan india Awards: ప్రకృతి వ్యవసాయానికి పాన్ ఇండియా అవార్డులు
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
కాగా సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీకి పెట్టుబడులు రావడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మరోసారి స్పష్టమైంది. ఈ మేరకు సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వరుసగా మూడో ఏడాది కూడా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ కేబినెట్ ఇప్పటికే ఇతర రంగాల్లో ఎస్ఐపీబీ (SIPB) ద్వారా రాష్ట్రానికి వచ్చిన 1,26,748 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రస్తుతం ఆమోదించిన ఈ పెట్టుబడులతో 40,330 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ భారీ ఒప్పందాలపై సంతకాలు చేశారు. త్వరలోనే విశాఖలో ఇన్ఫోసిస్ ఆఫీసు ప్రారంభం కానుంది. అటు తిరుపతి, శ్రీకాళహస్తి శివారు ప్రాంతాల్లో సుమారు రూ.6వేల కోట్ల పెట్టుబడులతో పలు కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. మొత్తానికి భారతదేశంలోనే పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా ఏపీ నిలుస్తోందని డీపీఐఐటీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!