IT Returns Refund: ఇంకమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా.. రెండు నెలలు దాటినా ఇంకా మీకు ఐటీఆర్ రీఫండ్ కాలేదా.. అయితే కొన్ని కారణాల వల్ల మీకు ఐటీఆర్ రీఫండ్ కాకపోవచ్చు. ఆ కారణాలేంటో ముందు తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఐటీఆర్ రీఫండ్‌కు మీరు అర్హులేనా అన్న విషయం తెలుసుకోవాలి. అందుకోసం ఐటీఆర్‌ను ఆదాయపు పన్నుశాఖ ప్రాసెస్ చేసిందా లేదా చూడాలి. ఒకవేళ రీఫండ్‌కు మీరు అర్హులు అని ఐటీశాఖ ధ్రువీకరిస్తేనే […]
Team India: ఆసియా కప్‌లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. జడేజా గాయంతో దూరం కావడం ఆసియా కప్‌లో జట్టుకు తీవ్ర నష్టం చేసింది. జడేజా అందుబాటులో లేకపోవడంతో టీమ్ కాంబినేషన్ కూడా చెల్లా చెదురైంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఆస్ట్రేలియా పరిస్థితుల నేపథ్యంలో జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ […]
సచివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు, కలెక్టర్ దిల్లీ రావు, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్, పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా హాజరయ్యారు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను అధికారుల నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా […]
Modi Birthday: సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ యజమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈనెల 17న తన రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లకు థాలీ పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పోటీలో గెలిచిన వారికి రూ.8.5 లక్షల నగదు అందజేస్తానని తెలిపాడు. అయితే కొన్ని షరతులు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్ 2.1 అనే రెస్టారెంట్‌లో మోదీ బర్త్ డేను పురస్కరించుకుని […]
Supreme Court: దేశవ్యాప్తంగా ప్రభుత్వం వద్ద నమోదైన విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు కామన్ డ్రెస్ కోడ్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని స్కూళ్లు, కాలేజీలలో కామన్ డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై విచారణను నిరాకరించింది. దేశంలో జాతీయ సమగ్రతను, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడానికి కామన్ డ్రెస్ కోడ్ అవసరమంటూ నిఖిల్ ఉపాధ్యాయ అనే […]
Andhra Pradesh: ఏపీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో వినియోగించరాదంటూ ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు. […]
Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు ఊరట లభించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్తకు రెండు రోజుల కిందట నాంపల్లి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొత్తపల్లి గీత, ఆమె […]
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త జోష్‌లో కనిపిస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఆసియా కప్‌లో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఉత్తేజంగా ముందుకు సాగిపోతున్నాడు. మరోవైపు ట్విట్టర్‌లో 50 మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్నాడు. ట్విట్టర్ వేదికగా పలు యాడ్‌లను షేర్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నాడు. తాజాగా ఫుమా కంపెనీకి చెందిన ఓ వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. ఈ వీడియోలో ఫుమా కంపెనీ గురించి కాకుండా తన […]
Gudivada Amarnath: ఏపీ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో అసెంబ్లీలో ఈ అంశంపై బిల్లు కూడా పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమకు సవాళ్లు విసరడం దేనికి అని.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పగానే […]
Andhra Pradesh: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా ఏపీలోని నెల్లూరులో తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన ఓ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ గదిలో భారీగా రికార్డులను గుర్తించిన అధికారులు.. ఆ గది తాళాన్ని […]