• తిరుమల: నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్న సేనాధిపతి విశ్వక్సేనుడు.. రేపు శ్రీవారి ఆలయంలో గరుడ పఠం ప్రతిష్ట.. కంకణధారణ కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవ కంకణధారణ చేయనున్న ఈవో ధర్మారెడ్డి, అర్చకులు • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘనంగా దేవీ నవరాత్రులు.. 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం.. నేడు స్వర్ణ కవచాలంకృత శ్రీకనకదుర్గ దేవిగా అమ్మవారి దర్శనం • శ్రీశైలంలో నేటి నుంచి […]
IND Vs AUS 3rd T20: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 21 టీ20ల్లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. ఓపెనర్లు రాహుల్ (1), రోహిత్ (17) ఇద్దరూ నిరాశపరిచినా విరాట్ కోహ్లీ (63), సూర్యకుమార్ యాదవ్ (69) […]
సాధారణంగా వీకెండ్ సెలవులు వస్తే ఎవరైనా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దీనికి చిన్నా, పెద్ద అనే తేడా ఉండదు. అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం వీకెండ్ సెలవులలో ఇంట్లో సేదతీరకుండా పొలం వైపు అడుగులు వేశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇద్దరూ తమ భార్యాపిల్లలతో కలిసి పొలంలో చెమట చిందించారు. రైతులతో పాటు వీళ్లు కూడా పొలంలో పనిచేశారు. ఈ సందర్భంగా బాపట్ల మండలం […]
IND Vs AUS 3rd T20: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ముందు భారీ స్కోరు నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి 5 ఓవర్లు, చివరి 5 ఓవర్లలో చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మొత్తం 52 […]
Formula E Car Racing: దేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ 2023లో ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఇప్పటికే ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ క్రీడా ప్రియుల సమక్షంలో ఫార్ములా ఈ-కార్‌ను హైటెక్ సిటీలోని కేబుల్ బ్రిడ్జిపై ఆవిష్కరించారు. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ […]
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌ను డిసైడ్ చేసే నిర్ణయాత్మక మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం […]
MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియాలో లైవ్‌లోకి వస్తానని.. గుడ్ న్యూస్ చెప్తానని శనివారం ప్రకటించాడు. దీంతో ధోనీ చెప్పే గుడ్ న్యూస్‌పై చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ధోనీ లైవ్‌లోకి వచ్చి చెప్పిన విషయం తెలిస్తే మీరు షాకవుతారు. ఇంతకీ ధోనీ ప్రకటించిన విషయం ఏంటంటే.. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ఓరియోను లాంచ్ చేశాడు. అయితే ఇది కమర్షియల్ ప్రకటన […]
BCCI Elections: బీసీసీఐ ఎన్నికలకు నగరా మోగింది. ఈ మేరకు ఆదివారం నాడు బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీసీసీఐ ఆఫీసు బేరర్ల పదవుల కోసం అక్టోబరు 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 18న ముంబైలో ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు అదే రోజున అధికారులు వెల్లడిస్తారు. ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా వ్యవహరిస్తున్నారు. అయితే గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టే అవకాశం ఉందని, జై షా బీసీసీఐ […]
ఈరోజు ఉప్పల్ వేదికగా జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ యాప్‌లో బెట్టింగ్‌లను ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇండియా గెలుస్తుందని భారీ స్థాయిలో బెట్టింగ్‌లు పెడుతున్నారని.. ఆసీస్ గెలుస్తుందని రూ.వెయ్యికి రూ.4వేలు బెట్టింగ్ నడుస్తోందని.. ఇండియా టాస్ గెలుస్తుందని బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అటు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్న 12 మందిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.