అమ్మో ఒకటో తారీఖు.. ఇది సినిమా పేరు కాదండి. నిజంగానే ఒకటో తారీఖు వచ్చిందంటే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. అలా శాలరీ క్రెడిట్ కాగానే ఇలా డబ్బులన్నీ అయిపోతాయి. ఉద్యోగులకే కాదు సామాన్యులందరికీ ఒకటో తారీఖు అంటే ఓ రకమైన ఫీలింగ్. అయితే అక్టోబర్ 1వ తేదీ సామాన్యుల జీవితాల్లో మరింత పెనుభారం కాబోతోంది. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సిస్టమ్‌లో నిబంధనలు, ఎల్‌పీజీ గ్యాస్ రేట్లు వంటి […]
Lakshmi Parvathi: తన పెళ్లిపై వ్యక్తిగత కామెంట్లు చేసేవారిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సంఘటన జరిగినా తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చరిత్ర చెరిపితే చెరిగిపోదని.. ఎన్టీఆర్‌ను తాను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ముందు నుంచీ ఇష్టం లేదన్నారు. తమ వివాహ ప్రకటనను అడ్డుకోవటానికి చంద్రబాబు మైక్ వైరులు కట్ చేసి లైట్‌లు ఆఫ్ చేసి నానా బీభత్సం చేశాడని.. అందరి సమక్షంలో జరిగిన తమ వివాహం […]
Hyderabad Metro: ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ట్రిప్పులు నడిపింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని గతంలోనే ప్రకటించగా… అభిమానులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం […]
Rohit Sharma: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా చితక్కొట్టేసింది. అంచనాల మేరకు రాణించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మ్యాచ్‌తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దు పెట్టుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ 8వ ఓవర్‌లో చాహల్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని మాక్స్‌వెల్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు. […]
CM Jagan: ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పట్టువస్త్రాలను ఆయన సమర్పించనున్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3:35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరుమలకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాత్రి 8:20 గంటలకు తిరుమల శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. మంగళవారం రాత్రికి తిరుమలలోనే బసచేయనున్నారు. బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని […]
Team India: ప్రస్తుతం టీమిండియాలో స్పిన్ కోటా బౌలర్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. జడేజా గాయంతో దూరమైనా చాహల్, అశ్విన్, రవి బిష్ణోయ్‌లలో ఒకరికే తుది జట్టులో అవకాశం దక్కుతుంది. ఫామ్‌తో తంటాలు పడుతున్న కుల్దీప్ యాదవ్‌ను సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించి తాను కూడా ఈ రేసులో ఉన్నాననే సంకేతాలు పంపాడు. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్-ఎతో జరిగిన రెండో వన్డేలో ఇండియా-ఎ తరఫున […]
Brahmastra: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్‌లో ఎన్నో భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా తొలి మూడు రోజులు ప్రేక్షకులు వాటిని పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లి ఈ మూవీని వీక్షించారు. ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ విజువల్ డ్రామాగా వచ్చి భారీ ఓపెనింగ్స్‌ను అందుకుంది. అయితే సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్‌లోనూ రూ.75కే టికెట్లు విక్రయించగా […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=tGu6YnD0wYk
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 5వరకు వేడుకలు కొనసాగుతాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు పరిమిత భక్తుల మధ్య వేడుకలు జరిగాయి. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమలులో లేనందున పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు కనీసం 14 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా ఇంద్రకీలాద్రి కొండ […]