Russia-Ukraine War: రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు.. రూ.35వేల కోట్లు ఆదా చేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukrain War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందరో సామాన్యుల జీవితాలను తలకిందులు చేసింది. ఒకరకంగా ఈ యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పలు దేశాలకు ఎగుమతులు, దిగుమతులపై ఈ యుద్ధం ప్రభావం చూపడంతో నిత్యావసర ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వల్ల భారత్ లాభపడిందని ప్రచారం జరుగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యా దగ్గర డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడంతో భారత్ రూ.35వేల కోట్లను ఆదా చేసింది. అయితే ఈ అంశాన్ని అమెరికా సహా కొన్ని దేశాలు వ్యతిరేకించినా భారత్ మాత్రం వెనక్కి తగ్గకుండా క్రూడాయిల్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటూ వచ్చింది. దీంతో ఈ ఏడాది జూలై నెలలో చైనా తర్వాత భారత్‌కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా నిలిచింది. ఈ క్రమంలో సౌదీ అరేబియాను మూడో స్థానానికి నెట్టింది. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా మళ్లీ రెండో స్థానానికి చేరుకోగా రష్యా తన పూర్వస్థానం మూడో స్థానానికి పడిపోయింది.
కాగా ఉక్రెయిన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా దాడులకు తెగబడింది. దీంతో క్రూడాయిల్ ధర బ్యారెల్ 140 డాలర్లకు చేరింది. 2014 తర్వాత బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటడం ఇదే తొలిసారి. అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా సహా ఇతర దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే ఈ ఆంక్షలను భారత్ లెక్క చేయలేదు. అంతేకాకుండా తక్కువ ధరకు తమకు క్రూడాయిల్ దిగుమతి చేయాలని భారత్ డిమాండ్ చేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్ రష్యా నుంచి ఒక శాతం మాత్రమే క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునేది. యుద్ధం తర్వాత ఇది 12 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్- మే నెల మధ్య రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు ఏకంగా 4.7 రెట్లు పెరిగాయి. రష్యా మన దేశానికి 35 డాలర్లకే బ్యారెల్ క్రూడాయిల్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు సుమారు రూ.35 వేల కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఏప్రిల్-జూలై మధ్య భారత్ 11.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును కొనుగోలు చేసింది. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం గత ఏడాది ఇదే కాలంలో 3 బిలియన్ డాలర్ల విలువైన చమురును మాత్రమే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. మార్చి నుంచి రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ పెంచడంతో 12 బిలియన్ డాలర్లకు పైగా కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!