Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జనసేన పేరును చంద్రసేనగా మార్చేస్తున్నట్టు చెప్పడానికే పవన్ సభ పెట్టాడన్నారు. సంక్రాంతి మామూళ్లు తీసుకుని రణ స్థలంలో ఒక ఈవెంట్ నిర్వహించి వెళ్లాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో రెండున్నర గంటలు దేశం గురించి మాట్లాడారంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. శీలం లేని పవన్ కళ్యాణ్ గంజాయి తాగి రణ స్థలంలో మాట్లాడాడని.. ఆంబోతు తోకకు మంట పెట్టినప్పుడు వేసినట్టు రంకెలు, బొంకులు తప్ప ఆయన ప్రసంగంలో ఇంకేమీ లేవన్నారు. కాపుల మీద పేటెంట్ ఉన్నట్టు మంత్రులపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
పవన్ తండ్రి కానిస్టేబుల్ కాక ముందు ఆయన అన్న నటించిన పునాదిరాళ్లు పడక ముందే తమ కుటుంబంలో రాజకీయాలు ప్రారంభమయ్యాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. నువ్వు లాగులు వేసుకునే సమయానికి తమ తాత ఎమ్మెల్యే అని వివరించారు. అసలు తమ కుటుంబం గురించి పవన్ మాట్లాడటానికి సిగ్గుండాలన్నారు. కేపిటల్ సిటీ విశాఖలో జీ-20 దేశాల సమావేశాలు నిర్వహిస్తున్నామని.. మార్చి 28,29 తర్వాత వైజాగ్‌పై ఫోకస్ మరింతగా పెరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్‌ను అందరూ పీఎస్‌పీకే అంటారని.. పీఎస్‌పీకే అంటే ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావొచ్చేమో కానీ పొలిటికల్‌గా మాత్రం విలన్ అని ఆరోపించారు. ప్యాకేజీకి అమ్ముడు పోలేదని సింహాచలం లక్ష్మీనరసింహస్వామి మీద, తల్లి మీద, అన్నయ్య మీద ప్రమాణం చేసే దమ్ము పవన్ కళ్యాణ్‌కు ఉందా అని మంత్రి అమర్నాథ్ నిలదీశారు. జనసేన కార్యకర్తలు తమ సైనికులు అనుకుంటుంటే వాళ్ళను గొర్రెలను చేసి గుత్తగా తాకట్టు పెట్టేశాడన్నారు. చంద్రబాబుకు పొలిటికల్ వైఫ్ పవన్ కళ్యాణ్ అని.. బీ.ఆర్.ఎస్.,ప్రజాశాంతి పార్టీతో పొత్తుకు కూడా వెనుకాడడని చురకలంటించారు. జెండా,అజెండా, విధి విధానాలు లేనోడు పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు.
Read Also: Hardik Pandya: టీమిండియా సహచర ఆటగాడిని బూతులు తిట్టిన హార్దిక్ పాండ్యా
మరోవైపు పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ కూడా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సిగ్గు, శరం లేని వ్యక్తి అని ఆరోపించారు. చంద్రబాబు సంక నాకటమే పవన్ కళ్యాణ్‌కు ఇష్టమన్నారు. ఇప్పుడు తన కార్యకర్తలను కూడా అదే పని చేయమంటున్నాడని.. సింగిల్‌గా ఎన్నికలకు వచ్చే దుమ్ము, ధైర్యం లేదన్నారు. రాజకీయం అంటే కొట్లాడుకోవటం అని పవన్ అనుకుంటున్నాడేమో అని ఎద్దేవా చేశారు. విజయవాడ రా అయితే.. లేదంటే ఎప్పుడు, ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. సంక్రాంతి పండుగ వసూళ్ళకు కాదా చంద్రబాబును కలిసింది అని జోగి రమేష్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను తాము ప్యాకేజీ స్టార్ అనే అంటామని.. అతడు పిచ్చి కుక్క మాదిరి వాగుతున్నాడని మండిపడ్డారు.