అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ నటులుగా ఇంతకు ముందు కూడా కలసి పని చేశారు. కానీ, ఇప్పుడు అజయ్ డైరెక్టర్ గా బిగ్ బీతో సినిమా చేస్తున్నాడు. అదే ‘మేడే’. సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా ఇందులో ఉండటం విశేషం!“అమితాబ్ ని డైరెక్ట్ చేయటం, ఏ దర్శకుడికైనా గొప్ప కల. అదృష్టవశాత్తూ నేను ఆ స్వప్నం సాకారం చేసుకోగలిగాను!” అన్నాడు అజయ్ దేవగణ్. అంతే కాదు బచ్చన్ సాబ్ సెట్ మీద ఉంటే పనులన్నీ చకచకా […]
అఫ్గనిస్తాన్ సంపూర్ణంగా తాలిబన్ల వశమైంది. మరోసారి ప్రజలు స్వంత దేశంలో బందీలైపోయారు. ఆడవారు, పిల్లల పరిస్థితి అయితే మరింత దారుణం. బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితి. కానీ, అఫ్గాన్ ఎప్పుడూ ఇలాగే ఉండేదా? కాదంటోంది సీనియర్ నటి హేమా మాలిని. కొన్ని దశాబ్దాల క్రితం ‘ధర్మాత్మా’ అనే సినిమా విడుదలైంది. అందులో ధర్మేంద్ర, హేమా మాలిని జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ ఓ గ్యాంగ్ స్టర్ గా, విలన్ గా నటించాడు. ఆ సినిమాలో హేమా మాలిని పాత్ర […]
ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బీటీఎస్ బాయ్స్ కి ఫ్యాన్స్ కొదవ అస్సలు లేదు. వాళ్ల సాంగ్స్, డ్యాన్స్ మూవ్స్ అంటే జనం పడి చచ్చిపోతున్నారు. ఇక తమని తాము ‘ఆర్మీ’గా పిలుచుకునే బీటీఎస్ ఫ్యాన్స్ ఇండియాలోనూ చాలా మందే ఉన్నారు. అందులో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ, దీపికా పదుకొణే లాంటి ఏ లిస్టర్స్ సైతం “మేం బీటీఎస్ ఆర్మీ” అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి లెటెస్ట్ గా ‘ఆర్మీ’లో […]
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు తాలిబన్ల పాలన కావటంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ వార్త అయింది. ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు సురక్షితంగా దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం తాలిబన్లు చేస్తున్న అరాచకాలు, వారు ఆడే ఆటలు కూడా బయటకు వస్తున్నాయి. దీనిపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. వరుసగా ట్వీట్ల మీద ట్వీట్ తో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిని […]
సంపత్‌కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ఉపశీర్షిక. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మధు యాదవ్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్న ప్రగ్యానయన్ ఫస్ట్‌లుక్‌ను నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ”ఈ చిత్రంలో పార్వతిగా కథానాయిక ప్రగ్యానయన్ ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో అందర్ని అలరించబోతుంది. నిర్మాణానంతర […]
మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది మల్టీ స్టారర్ చిత్రం కావడంతో రానాను సరిగ్గా ఉపయోగించుకోవటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. టైటిల్ వన్ సైడే ఉండటం, ఇప్పటివరకు రానా పోస్టర్ కూడా రాకపోవటంతో ఆయన అభిమానులు కాస్త నిరాశగా వున్నారు. అయితే తాజా సమాచారం […]
ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైన మలయాళ చిత్రం ‘నాయత్తు’ తెలుగు రీమేక్ పై చాలామంది కన్నేశారు. అయితే దాని పునర్ నిర్మాణ హక్కుల్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగువారికి నచ్చుతుందనేది అల్లు అరవింద్ నమ్మకం. విశేషం ఏమంటే ఇందులో ఓ కీలక పాత్రకు రావు రమేశ్ ను ఎంపిక చేశారు. మూవీ కథ ఆయన చుట్టూనే తిరుగుతుండటంతో బిజీ ఆర్టిస్ట్ అయిన రావు రమేశ్ […]
ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే! ఈ యేడాది పుట్టిన రోజుకు చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నట్టు! అయితే ఇందులో ‘ఆచార్య’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూ ఉంటే, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ షూటింగ్ జరుపుకుంటూ ఉంది. సో… సహజంగానే ‘ఆచార్య’, ‘లూసిఫర్’ రీమేక్ కు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ వస్తుంది. ‘ఆచార్య’ నుండి సాంగ్ లేదా ట్రైలర్ […]
తొలి చిత్రం ‘ఉప్పెన’తో కలెక్షన్ల సునామి సృష్టించాడు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ యేడాది ఫిబ్రవరి 12న ప్రేమికుల దినోత్సవ కానుకగా వచ్చిన ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. విశేషం ఏమంటే ఈ సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్… వైష్ణవ్ తేజ్ తో సినిమాను తెరకెక్కించాడు. క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించింది. సాఫ్ట్ వేర్ […]
హీరో సుధీర్ బాబు, హీరోయిన్ ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా, ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆగస్టు 27న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో మరింత జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో […]