పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయికగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. కాగా, నేడు నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనుంది. నిండుగా చీరకట్టు, నగలు, నాట్యంతో నిధి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ […]
రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమ సంబంధంతో ఓ యువకుడు బలైయ్యాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ లో ఈ సంఘటన చోటుచేసుకొంది. నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోంది. గత రాత్రి భర్త లేని సమయంలో నేహా, సోయల్ ను ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. భర్త మొయినుద్దీన్ భార్య నేహాను, ప్రియుడు సోయల్ గదిలో చూసి నిలదీయడంతో నేహా ప్లేట్ ఫిరాయించింది, సోయల్ నన్ను […]
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దారి దోపిడీ కలకలం సృష్టించింది. జలాలుద్దీన్ అనే బిస్కెట్లు వ్యాపారికి కత్తి చూపించి బెదిరించిన దుండకులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు అగంతకులు వ్యాపారిపై దాడి చేసి జేబులో నుంచి డబ్బులు లాక్కున్నారు. గంజాయి సేవించే గ్యాంగు తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరా ఆధారంగా అగంతకులపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్.దర్శన్ దర్శకత్వం వహించారు. రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వైవిధ్యమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’ని దర్శకనిర్మాతలు చెప్పుకొస్తున్నారు. వెన్నెల […]
కరోనా కారణంగా ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తున్న తరుణంలో ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ థియేటర్లకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆగస్టు 6న విడుదల అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లోనూ మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూసి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆశర్యపోయిందట. దీంతో భారీ రేటుతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై […]
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈరోజు మార్నింగ్ జిమ్‌లో బాస్‌ని కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అని రాసుకొచ్చారు. కాగా, ఆయన చేతి గాయాన్ని చిరు అడిగి తెలుసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఇటీవలే షూటింగ్ లో ప్రమాదానికి గురికావడంతో చిన్న సర్జరీ అయిన […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 13, 2021 విడుదల కానుంది. కాగా, షూటింగ్ ఇంకా సెట్స్ మీదే ఉండటంతో విడుదల ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, చెప్పిన తేదీకే ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొచ్చేందుకు రాజమౌళి గట్టిగానే ప్రయాణిస్తున్నారు. […]
(ఆగస్టు 17న ‘జెంటిల్ మేన్’ శంకర్ బర్త్ డే) అలాగ వచ్చి, ఇలాగ మెచ్చే చిత్రాలను రూపొందించి జనం మదిలో చెరిగిపోని స్థానం సంపాదిస్తారు కొందరు. వారిని అదృష్టవంతులు అనుకుంటాం. కానీ, ప్రేక్షకులను ఆకట్టుకొనేలా సినిమాలను తెరకెక్కించడం వెనుక వారి కృషి, దీక్ష, పట్టుదలను మరచిపోరాదు. తొలి చిత్రం ‘జెంటిల్ మేన్’తోనే తనదైన బాణీ పలికించిన దర్శకుడు శంకర్ తెలుగునాట సైతం తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. మొట్టమొదటిసారి తెలుగులో ఓ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో […]
బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలతో సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. మరో పక్క శ్రీముఖి కూడా గ్లామర్ తో కళకళ్లాడిపోతోంది. తాజాగా సినిమాలోని […]