నేడు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ సభలో ప్రారంభించారు. అయితే కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 న కాంగ్రెస్ దళిత దండోరా సభ.. ఆ తర్వాత హుజురాబాద్ పై దండ ఎత్తుతాం.. కేసీఆర్ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. […]
‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని, సాహితీ అవంచ, ‘వైశాలి’ ఫేమ్ నందన్ ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’. ఈ సినిమాను రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దీనికి రచయిత, దర్శకుడు. ప్రముఖ సంగీత దర్శకులు తమన్ […]
సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాలు రూపొందిస్తున్న కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు ఈ కేసుకు సంబంధించిన పలువురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ శిల్పా శెట్టిని కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారించారు. వ్యక్తిగతంగాను శిల్పా కెరీర్ పై ఈ ప్రభావం గట్టిగానే పడింది. ఇదిలావుంటే, తాజాగా శిల్పా ఓ ఈవెంట్ లో ఫిట్ […]
సినిమా వాళ్ళు సున్నిత మనస్కులు. చిన్న సంఘటన జరిగినా త్వరగా చెలించిపోతారు. కానీ అలాంటి సినిమా వాళ్ళే ఒక్కోసారి తమ ముందే అతి పెద్ద దారుణం జరిగినా స్పందించారు. ఆ కోవకు తాను చెందనని అంటున్నాడు అడివి శేష్. గత కొన్ని రోజులుగా ఆఫ్ఠనిస్థాన్ లో తాలిబన్లు చేస్తున్న దారుణ మారణ కాండను తెలియచేసే ఓ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి… ఆ లేఖ తన హృదయాన్ని బ్రద్దలు చేసిందని పేర్కొన్నాడు అడివి శేష్. […]
ఇవాళ ఓటీటీలతో తమిళ టెలివిజన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కాని చిత్రాలను ఓటీటీతో పోటీగా శాటిలైట్ హక్కులు పొంది, తమ ఛానెల్స్ లో ప్రసారం చేస్తున్నాయి. అలా… ఐశ్వర్య రాజేశ్ నటించిన ఎకో హారర్ థ్రిల్లర్ ‘భూమిక’ తమిళ చిత్ర ప్రసార హక్కులను విజయ్ టీవీ పొందింది. ఆగస్ట్ 22న ఈ సినిమాను ప్రసారం చేయబోతోంది. విశేషం ఏమంటే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ 23వ తేదీ దీనిని […]
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన 30 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తే మేము సహకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. అల.. చేస్తే ఎక్కడ సంతకం పెట్టాలి అంటే అక్కడ పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనుల నుంచి గుంజుకున్నారని […]
బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాలోనూ తళుక్కుమంటున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రల్లోను రాణిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం ఈ నెల 19న విడుదల అవుతోంది. సినీ గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి శ్రీముఖి కలిసి నటించగా.. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. కాగా, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ వేగాన్ని పెంచింది. […]
ఎనిమిదేళ్ళ క్రితం రాజ్ తరుణ్ ను ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పరిచయం చేశాడు నాగార్జున. ఆ తర్వాత ఐదేళ్ళకు రాజ్ తరుణ్ తోనే ‘రంగుల రాట్నం’ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా రాజ్ తరుణ్ తో మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు నాగార్జున. హడావుడీ లేకుండా మొదలైన ఆ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందట. 2016లో రాజ్ తరుణ్ హీరోగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రాన్ని […]
ఆప్ఘనిస్థాన్ పరిస్థితుల ప్రభావం జమ్మూకాశ్మీర్ సహా భారత్ పై అంతగా ఉండదు అని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం రుద్రారంలో ప్రైవేట్ యూనివర్సిటీ లో సెమినార్ కు హాజరైన ఒమర్ ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోకి చొరబాటుదారుల సంఖ్య బాగా తగ్గింది, దేశ సరిహద్దులు పటిష్టంగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపరిచేందుకు రెండేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజాభీష్టానికి విరుద్ధంగా జమ్మూకాశ్మీర్ ను […]
ప్రముఖ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హీరోగానూ పలు చిత్రాలలో నటిస్తున్నాడు. మరికొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే శ్రీనివాసరెడ్డి నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రం విడుదలైంది. ‘ప్లాన్ బి’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో అతను కీలక పాత్ర పోషించిన మరో సినిమా ‘హౌస్ అరెస్ట్’ ఈ నెల 27న విడుదల కాబోతోంది. సినిమా పంపిణీ రంగంలో ఉన్న కె. నిరంజన్ రెడ్డి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలియత్నంగా ‘హౌస్ అరెస్ట్’ […]