తెలుగు చిత్రసీమలో వెలసిన పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించే సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా […]
బాలనటునిగానే భళా అనిపించిన మంచు మనోజ్, కథానాయకునిగానూ కదం తొక్కాడు. కానీ, ఎందుకనో కొంతకాలంగా మనోజ్ పదం మునుపటిలా ముందుకు సాగడం లేదు. అయినా మనోజ్ తనకంటూ కొంతమంది అభిమాన గణాలను సొంతం చేసుకొని, వారిని మెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా బరిలోకి అయితే దూకాడు కానీ, తండ్రిలా వడి వాడి వేడి అన్నవి మనోజ్ లో అంతగా కనిపించవు. మనోజ్ ఆచితూచి అడుగు వేస్తూ సాగడం వెనుక కారణాలేమున్నా, అతని […]
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని బాగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు జిల్లాలో కలకలం రేపింది. గుప్తనిధుల కొరకు దేవతామూర్తి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ పూజారి సోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. గుప్తనిధుల కోసమే విగ్రహాల ధ్వంసం చేసినట్లు తెలుస్తుందని ఎస్సై పేర్కొన్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్‌లో రూపొందిన ప్రేమకథా చిత్రం ‘99 సాంగ్స్’. ఇహాన్ భట్, ఎడిల్‌సీ జంటగా నటించారు. విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 21 నుంచి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
భారత మాజీ మహిళా క్రికెటర్ తల్లి కరోనా ట్రీట్‌మెంట్ కోసం తన వంతు సాయం అందించాడు విరాట్ కోహ్లీ. టీమిండియా మాజీ మహిళ క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడు చికిత్స కోసం రూ.6.77 లక్షలను కోహ్లీ విరాళంగా ఇచ్చాడు. తనకు సాయం చేసినందుకు ఆ మహిళా క్రికెటర్, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. స్రవంతి నాయుడు తల్లి ఎస్‌కే సుమన్ ఇటీవలే కరోనా బారీన పడ్డారు. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్ చేసి […]
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసుపై ఆయనను ఇటీవల ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా, తనను కొట్టారంటూ ఆయన ఆరోపించడంతో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రఘురామకృష్ణంరాజు కూతురు ఇందు ప్రియదర్శిని, కుమారుడు భరత్ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రఘురామపై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలను అమిత్‌షాకు ఇందు […]
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సోదరిగా రమ్యకృష్ణ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే ప్రభాస్ సినిమాలో ఇది వరకే బాహుబలి సినిమాలో తల్లి పాత్రలో మెప్పించిన రమ్యకృష్ణ, ఈసారి సోదరి పాత్ర అంటే అంతగా వర్కౌట్ అవుతుందో, లేదో అని […]
అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. అయితే ‘బంగార్రాజు’లో మాత్రం మరో హీరోయిన్‌కి ఛాన్స్ లేదని తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన కథకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. దీంతో లావణ్య పాత్రకి అవకాశం లేనట్టుగా […]
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. యంగ్ టైగర్ కోమరం భీంగా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటలకు కోమరం భీంకు సంబంధించిన […]