ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సోదరిగా రమ్యకృష్ణ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే ప్రభాస్ సినిమాలో ఇది వరకే బాహుబలి సినిమాలో తల్లి పాత్రలో మెప్పించిన రమ్యకృష్ణ, ఈసారి సోదరి పాత్ర అంటే అంతగా వర్కౌట్ అవుతుందో, లేదో అని చిత్రబృందం భావించిందట. అయితే రీసెంట్ గా ముద్దుగుమ్మ జ్యోతికను సంప్రదించారట. వీరిద్దరి స్క్రీన్ ఫెయిర్ కూడా చూడ్డానికి అచ్చం అన్న-చెల్లెలుగా సెట్ అవుతుందని టాక్. కాగా భిన్నమైన పాత్రలు చేసే జ్యోతిక ప్రభాస్ సోదరిగా ఎటువంటి కారణాలు లేకుండానే ఒకే చేసిందనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.