ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్‌లో రూపొందిన ప్రేమకథా చిత్రం ‘99 సాంగ్స్’. ఇహాన్ భట్, ఎడిల్‌సీ జంటగా నటించారు. విశ్వేష్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 21 నుంచి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.