ఆ’నందమూరి’ంచే అభినయరత్న!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనానికి ‘జూనియర్ యన్టీఆర్’… అభిమానులకు ‘యంగ్ టైగర్’… సన్నిహితులకు ‘తారక్’… వెరసి ‘బుల్లి రామయ్య’ – అతనంటే తెలుగువారందరికీ అభిమానమే! నందమూరి నటవంశం మూడో తరం హీరోల్లో ఎందరున్నా, జూనియర్ యన్టీఆర్ దే పైచేయి. తాత తారకరాముని పేరు పెట్టుకొని, ఆ నామానికి ఉన్న గౌరవాన్ని నిలుపుతూ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తున్నాడు తారక్. తండ్రి హరికృష్ణ పౌరుషాన్ని నింపుకొని అభిమానుల మదిలో యంగ్ టైగర్ గా నిలిచాడు. నవతరం కథానాయకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ అశేష అభిమానుల మదిని గెలిచాడు.
పురాణ పాత్రపోషణలో నందమూరి వారిదే పైచేయి. అందులో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. ఈ బుల్లిరామయ్య సైతం పురాణ పాత్రతోనే తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు. తాత దర్శకత్వంలో హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో బాలభరతునిగా నటించిన తారక్, కొద్ది కాలానికే ‘రామాయణం’లో రామునిగా నటించి, తెలుగు తెరపై తొలిసారి వెలిగాడు. నటరత్న యన్టీఆర్ కు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన నటవారసునిగా బాలకృష్ణ నందమూరి నటనావైభవాన్ని ఇప్పటికీ జనానికి గుర్తు చేస్తూనే ఉన్నారు. అదే పంథాలో పయనించడానికి ఆ ఇంట మూడోతరం పంటగా జూనియర్ యన్టీఆర్ బయలు దేరాడు. ఆరంభం నుంచీ మాస్ ను మెప్పించే పాత్రలతోనే పరవశింప చేస్తున్నాడు తారక్. చిత్రసీమలో ప్రవేశించక ముందు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన తారక్ పదేళ్ళ ప్రాయంలోనే నాట్యంలో రికార్డు స్థాయి ప్రదర్శన ఇచ్చాడు. ఆ తరువాత నాట్యాభ్యాసాన్ని అంతగా పట్టించుకోని తారక్ ముద్దుగా బొద్దుగా తయారయ్యాడు. లావుంటేనేమీ మా బాగా ఉన్నాడంటూ జనం అభిమానించారు. “స్టూడెంట్ నంబర్ వన్”తో తొలి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న యన్టీఆర్ “ఆది”గా అదరహో అనిపించాడు. “సింహాద్రి”గా శివాలెత్తిపోయాడు. ఆ రెండు చిత్రాల తరువాత మాస్ లో తారక్ కు విశేషమైన ఫాలోయింగ్ నెలకొంది. తాత, బాబాయ్ లాగే అనేక రికార్డులను సొంతం చేసుకొని అభిమానగణాలకు ఆనందం పంచాడు తారక్.
Also Read
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
ఆరంభంలో ముద్దుగా బొద్దుగా మురిపించిన తారక్, “యమదొంగ”లో నాజూగ్గా మారిపోయాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా పాత్రకు తగ్గట్టుగా శరీరసౌష్టవాన్ని మార్చుకుంటూ తడాఖా చూపిస్తున్నాడు తారక్. నందమూరి నటవంశానికి అభినయంతో పాటు వాచకం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. “యమదొంగ”లో తనదైన వాచకంతో ఎదురుగా మోహన్ బాబు లాంటి వాచకాభినయంలో మేటి ఉన్నా, తగిన పోటీనిచ్చి తారక్ మెప్పించిన తీరును జనం మరచిపోలేరు. “టెంపర్” కోర్టు సీన్ లో తాత “బొబ్బిలిపులి”ని గుర్తుకు తెచ్చాడు ఈ బుల్లి రామయ్య. “అదుర్స్”లో ద్విపాత్రాభినయంలో యంగ్ టైగర్ చూపించిన వైవిధ్యాన్ని ఎవరు మాత్రం మరచిపోగలరు? మనసు బాగోకపోతే ఇప్పటికీ ఎందరో అభిమానులు ‘అదుర్స్’లోని చారి పాత్రలో జూనియర్ అభినయాన్ని చూసి మురిసిపోతుంటారు. ఇక ‘జై లవకుశ’లో తారక్ త్రిపాత్రాభినయం అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది.
తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేయాలని తపించే యంగ్ టైగర్ డ్యాన్సుల్లోనూ భళా అనిపిస్తున్నాడు. తారక్ నటనతో పాటు, అతని నర్తనాన్నీ అభిమానించేవారెందరో చిత్రసీమలోనే ఉన్నారు. యన్టీఆర్ సమకాలికులు సైతం ఆయన నాట్యాన్ని అభిమానిస్తారంటే అతిశయోక్తి కాదు. ఓ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ నాటి హీరోలలో నంబర్ వన్ డ్యాన్సర్ గా నిలిచాడు తారక్. తనకు లక్కీ హ్యాండ్ గా నిలచిన డైరెక్టర్ రాజమౌళితో ఇప్పటికే మూడు ఘనవిజయాలను చవిచూసిన తారక్, ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’తో జనం ముందుకు రాబోతున్నాడు. తెలుగు చిత్రసీమలో ఎందరు హీరోల మధ్య పోటీ సాగినా, ఆ తరంలో యన్టీఆర్, ఏయన్నార్ మధ్య తరువాత చిరంజీవి, బాలకృష్ణ నడుమే అసలు సిసలు పోటీలు నెలకొన్నాయి. అయితే చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటి దాకా ఏ నాడూ కలసి నటించలేదు. నందమూరి మూడోతరం హీరో అయిన తారక్ తో చిరంజీవి నటవారసుడు రామ్ చరణ్ ఈ ‘ట్రిపుల్ ఆర్’లో కలసి నటించడం సర్వత్రా విశేషంగా మారింది. అసలే ‘బాహుబలి’ సిరీస్ ఘనవిజయంతో రాజమౌళి దేశవిదేశాల్లో ఖ్యాతి సంపాదించాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ‘ట్రిపుల్ ఆర్’ మరింత ఆసక్తిని నెలకొల్పింది. నిజానికి ఈ తరం అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ రానుంది. ఇందులోనూ తారక్ అభినయం అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కొమరం భీమ్ ను పోలిన పాత్రలో బుల్లి రామయ్య ‘ట్రిపుల్ ఆర్’లో సందడి చేయనున్నాడు. మరి ‘ట్రిపుల్ ఆర్’ ఏ రోజున జనం ముందు నిలుస్తుందో కానీ, అందులోనూ తారక్ మరో మారు తన అభినయంతో ఆకట్టుకుంటాడని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!